ముంచేసిన తుఫాన్‌!

ABN , First Publish Date - 2020-11-28T04:48:55+05:30 IST

నివర్‌ తుఫాన్‌ జిల్లా రైతులను నిండా ముంచేసింది. గురువారం కూడా చిరుజల్లులు కురిశాయి. చలిగాలులు కూడా వీచాయి.

ముంచేసిన తుఫాన్‌!
గంట్యాడ మండలం రామవరంలో వర్షపు నీటిలో వరి చేను

     నివర్‌ ప్రభావంతో జిల్లాలో చిరుజల్లుల జోరు   

  ముంపులో వరి పంట  

 ఆందోళనలో రైతులు

  (ఆంధ్రజ్యోతి బృందం)

నివర్‌ తుఫాన్‌ జిల్లా రైతులను నిండా ముంచేసింది. గురువారం కూడా చిరుజల్లులు కురిశాయి. చలిగాలులు కూడా వీచాయి. చేతికందొచ్చిన పంటను కాపాడుకునేందుకు రైతన్నలు నానా అవస్థలు పడుతున్నారు.  కొన్నిచోట్ల పొలాల్లో వరికుప్పలు నీట మునిగాయి.  భోగాపురం మండలంలో సుమారు 50 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. ఇంకొన్నిచోట్ల పంట  నేలకొరిగి నీటమునిగింది.  దీంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈ ఏడాది నష్టాలు తప్పేలా లేవని వాపోతున్నారు. మరో వైపు తీరంలో మత్స్యకారులు ఇళ్లకే పరిమితమయ్యారు. వలలు, పడవలు, వేట సామగ్రిని భద్రపరుచుకునే పనిలో నిమగ్నమయ్యారు. తుఫాన్‌ సమయంలో ప్రభుత్వం కరువుభత్యం అందించాలని వారు కోరుతున్నారు. 

Read more