గ్రీన్‌ దివాళి పోస్టర్‌ ఆవిష్కరణ

ABN , First Publish Date - 2020-11-04T04:22:01+05:30 IST

పర్యావరణ పరిరక్షణలో భాగంగా జిల్లావాసులు ఇళ్లలోనే దీపాలు వెలిగించి దీపావళి పండగ చేసుకోవాలని ఎస్పీ రాజకుమారి సూచించారు. ప్రముఖ స్వచ్ఛంద సంస్థలు ఎస్‌ఆర్‌, సేవ్స్‌ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ‘గ్రీన్‌ దీవాళి, సేఫ్‌ దీవాళి’ పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు.

గ్రీన్‌ దివాళి పోస్టర్‌ ఆవిష్కరణ
పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న ఎస్పీ


విజయనగరం క్రైం, నవంబరు 3:

పర్యావరణ పరిరక్షణలో భాగంగా జిల్లావాసులు ఇళ్లలోనే దీపాలు వెలిగించి దీపావళి పండగ చేసుకోవాలని ఎస్పీ రాజకుమారి సూచించారు. ప్రముఖ స్వచ్ఛంద సంస్థలు ఎస్‌ఆర్‌, సేవ్స్‌ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ‘గ్రీన్‌ దీవాళి, సేఫ్‌ దీవాళి’ పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీ  మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో పొగ, దుమ్ము కాలుష్యాన్ని వెదజల్లే టపాసులను కాల్చొదన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులను దృష్టిలో ఉంచుకుని పండగ చేసుకోవాలన్నారు.  సేవ్స్‌ సంస్థ ప్రతినిధి జి.హిమబిందు, సైకాలజిస్ట్‌ డాక్టర్‌ సూర్యనారాయణ, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు. ఫ మహిళా రక్షక్‌ పోలీసులకు 15 రోజుల పాటు తైక్వాండో శిక్షణ ఇచ్చిన  మాస్టర్‌ చెలికాని వేణుగోపాల్‌ను ఎస్పీ సత్కరించారు.  శిక్షణ పూర్తి చేసుకున్న వారు వివిధ పాఠశాలల్లో విద్యార్థినులకు తైక్వాండోలో తర్ఫీదు ఇస్తార న్నారు. బొబ్బిలి, పార్వతీపురంలో కూడా శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపడుతు న్నామని స్పష్టం చేశారు.  దిశా పోలీసు స్టేషన్‌ డీఎస్పీ డి.త్రినాథ్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

  

Updated Date - 2020-11-04T04:22:01+05:30 IST