గ్రీన క్రాకర్స్‌తో దీపావళి

ABN , First Publish Date - 2020-11-14T03:55:22+05:30 IST

గ్రీన క్రాకర్స్‌తో దీపావళి వేడుక నిర్వహించాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ జిల్లా ప్రజలకు సూచించారు.

గ్రీన క్రాకర్స్‌తో దీపావళి
కలెక్టర్‌ హరిజవర్‌లాల్‌



ప్రజలకు కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ విజ్ఞప్తి 

రాత్రి 8నుంచి 10 గంటల వరకే అనుమతి

కలెక్టరేట్‌, నవంబరు 13: గ్రీన క్రాకర్స్‌తో దీపావళి   వేడుక నిర్వహించాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ జిల్లా ప్రజలకు సూచించారు. శుక్రవారం ఆయన  విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాత్రి 8 నుంచి 10 గంటల వరకూ మాత్రమే బాణసంచా కాల్చేందుకు అనుమతించినట్టు చెప్పారు. కొవిడ్‌ నిబంధనల దృష్ట్యా ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిందని చెప్పారు.  ప్రజలు నిబంధనలు పాటించి సహకరించాలని కోరారు. పర్యావరణానికి హాని కలిగించే మందుగుండు సామగ్రి అమ్మకూడదన్నారు. తాత్కాలిక షాపుల మధ్య పది అడుగుల దూరం ఉండాలని సూచించారు. కొనుగోలుదారులు తప్పకుండా మాస్కులు ధరించాల న్నారు. బాణసంచా కాల్చేటపుడు హ్యాండ్‌ శానిటైజర్‌ వాడకూడదని..సోప్‌ శానిటైజర్‌ మాత్రమే వాడాలని ఆయన సూచించారు. 
























Updated Date - 2020-11-14T03:55:22+05:30 IST