కలవరం

ABN , First Publish Date - 2020-11-26T04:33:35+05:30 IST

నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో రైతుల్లో కలవరం నెలకొంది. తీరం దాటే సమయంలో వర్షాలు పడతాయేమోనని భయపడుతున్నారు. గత రెండు రోజులుగా అక్కడక్కడ వాన పడడంతో వరి చేలను వ్యవసాయ క్షేత్రాల్లోనే కుప్పలుగా వేసే పనులను చకాచకా చేపట్టారు. బుధవారం కూడా యుద్ధ ప్రాతిపదికన కోసిన చేలను భద్రపరిచారు.

కలవరం
వరి చేలను పొలాల్లో కుప్పలుగా వేస్తున్న రైతులు


తుఫాన్‌పై రైతుల్లో ఆందోళన

 (విజయనగరం- ఆంధ్రజ్యోతి)

నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో రైతుల్లో కలవరం నెలకొంది. తీరం దాటే సమయంలో వర్షాలు పడతాయేమోనని భయపడుతున్నారు. గత రెండు రోజులుగా అక్కడక్కడ వాన పడడంతో వరి చేలను వ్యవసాయ క్షేత్రాల్లోనే కుప్పలుగా వేసే పనులను చకాచకా చేపట్టారు. బుధవారం కూడా యుద్ధ ప్రాతిపదికన కోసిన చేలను భద్రపరిచారు.  తుఫాన్‌ ప్రభావం ప్రస్తుతానికి లేదు. తీరం దాటే సమయంలో ఎంతో కొంత ప్రభావం ఉంటుందేమోనన్న భయం మాత్రం రైతుల్లో కనిపిస్తోంది. వాతావరణ శాఖ మాత్రం తీర ప్రాంత మండలాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో పెద్దగా ప్రభావం ఉండబోదని చెబుతోంది. డెంకాడ, గంట్యాడ, వేపాడ, నెల్లిమర్ల, బొండపల్లి, విజయనగరం ప్రాంతాల్లో వరి చేలను భద్రపరిచే పనులు ఊపందుకున్నాయి. ఇదిలా ఉండగా వరి చేలు కోయని కొందరు రైతులు గత రెండు రోజులుగా చేతికి వచ్చిన పత్తిని సేకరించి ఇళ్లకు చేర్చుతున్నారు. వర్షం పడితే పత్తి కాయల నుంచి పేలిన దూది తడిసి.. నష్టం వాటిల్లే పరిస్థితి ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని పత్తిని సేకరించే పనులు చేపడుతున్నారు. 


Read more