-
-
Home » Andhra Pradesh » Vizianagaram » District leading in implementation of schemes Collector
-
పథకాల అమలులో జిల్లా ముందంజ : కలెక్టర్
ABN , First Publish Date - 2020-12-20T04:20:13+05:30 IST
ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో జిల్లా ముందంజలో ఉందని కలెక్టర్ హరిజవహర్‌లాల్ శనివారం ఒక ప్రకటనలో తెలి పారు.

విజయనగరం (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో జిల్లా ముందంజలో ఉందని కలెక్టర్ హరిజవహర్‌లాల్ శనివారం ఒక ప్రకటనలో తెలి పారు. జగనన్న తోడు, చేయూత, బీమా వంటి పథకాల అమలుకు ప్రత్యేక ప్రణా ళిక అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులను ఎప్పటి కప్పుడు అప్రమత్తం చేస్తున్నామన్నారు. పథకాల పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో డీఆర్‌డీఏ కార్యాలయంలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రత్యే కంగా నియ మించిన కోర్ టీం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ పని చేస్తోందన్నారు. బీమా పఽథకం అమలులో జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచిందని తెలిపారు. జిల్లాలో 6,97,161 బియ్యం కార్డులు ఉండగా 5,92,867 కార్డులకు సర్వే పూర్తి చేశామన్నారు. జగనన్న తోడు పథకం లో ఉత్తమ ప్రగతిని సాధించామన్నారు.