10 నుంచి బోదకాలు నివారణ మందుల పంపిణీ

ABN , First Publish Date - 2020-02-08T10:23:26+05:30 IST

బోదవ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా ఈనెల 10 నుంచి మందులు పంపిణీ చేయనున్నట్లు అడిషినల్‌

10 నుంచి బోదకాలు నివారణ మందుల పంపిణీ

అడిషినల్‌ డీఎంహెచ్‌వో రవికుమార్‌


రింగురోడ్డు, ఫిబ్రవరి 7 : బోదవ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా ఈనెల 10  నుంచి  మందులు పంపిణీ చేయనున్నట్లు అడిషినల్‌ డీఎంహెచ్‌వో డాక్టర్‌ జె.రవికుమార్‌ తెలిపారు. శుక్రవారం స్థానిక డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  ఇదేరోజు నులి పురుగుల నివారణకు అల్బెండ్‌జోల్‌ మాత్రలు పంపణీ చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో 25,53,297 మంది జనాభా ఉన్నారని, వారిలో 23,49,033 మందిని ఎంపిక చేశామని చెప్పారు. వీరికి 4,642 టీములతో డీఈసీ, అల్బెండ్‌జోల్‌ మాత్రలు  అందజేయనున్నామన్నారు.  58,72,583   డీఈసీ, 23,49,03  అల్బెండ్‌జోల్‌ మాత్రలు సిద్ధం చేయగా,  928మంది సూపర్‌వైజర్లు నియమించామన్నారు. ఈ సారి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని, పూర్తిగా శిక్షణ ఇచ్చిన వారినే మాత్రలు వేసేందుకు పంపించనున్నామని తెలిపారు. రెండేళ్ల చిన్నారులు,  గర్భిణులు,  తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారు   ఈ మాత్రలు తీసుకోరాదన్నారు. క్యూలెక్స్‌ దోమల కాటు వల్ల ఫైలేరియా వ్యాధి వస్తుందని తెపాఆరు. ఈ  దోమలు మురుగునీరు నిల్వ ఉన్న ప్రాంతంలో ఎక్కువగ పెరుగుతాయని, వాటిని నియంత్రిస్తే..  ఫైలేరియా  బారిన పడకుండా రక్షణ పొందొచ్చ న్నారు. ఏదేమైనా ప్రతిఒక్కరూ ముందస్తుగా  డీఈసీ మాత్రలు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఐవో శంకరరావు, సుబ్బారావు, రామచంద్రుడు, లక్ష్మునాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-08T10:23:26+05:30 IST