పేదలకు నిత్యావసరాల పంపిణీ

ABN , First Publish Date - 2020-05-11T10:57:19+05:30 IST

నగరంలోని 28,44వ డివిజన్ల పరిధిలోని రాజీవ్‌నగర్‌ కాలనీలో ఆది వారం ప్రైవేటు డిగ్రీకళాశాలల

పేదలకు నిత్యావసరాల పంపిణీ

విజయనగరం రూరల్‌, మే 10: నగరంలోని 28,44వ డివిజన్ల పరిధిలోని  రాజీవ్‌నగర్‌ కాలనీలో ఆది వారం ప్రైవేటు డిగ్రీకళాశాలల యాజమాన్యాల ఆధ్వ ర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి హాజరయ్యారు. ఆపత్కాలంలో పేదలు, నిరాశ్రయులను ఆదుకోవడానికి అందరూ స్వచ్ఛందంగా ముందుకు రావా లని పిలుపునిచ్చారు.  సినిమా థియేటర్స్‌లో పనిచేస్తున్న కార్మికులకు ఆల్‌ సినీస్టార్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, కూరగాయలను  పం పిణీ చేశారు.


స్థానిక  ఎన్‌సీఎస్‌ థియేటర్‌లో నిర్వ హించిన ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ ప్రతినిధులు, సినిమా థియేటర్స్‌ సంఘాల నాయకులు నారాయణం శ్రీనివాసరావు, ఉదయ్‌,  నాయుడు, బాలు, రాంకీ, వాసు, మన్మధ, సుబ్రహ్మణ్యం, దుర్గాప్రసాద్‌, వాసు, రమేష్‌, అరవింద్‌, రమణ రాజు, మణిరాజు, నాగరాజు తదిత రులు పాల్గొన్నారు.  ఇక మెరకముడిదాం మండలం  బైరి పురం, గర్భాం ఆటోస్టాండ్‌లోని 190 మంది డ్రైవర్లకు,  గరివిడి మండలం శేరీపేటలో, బొబ్బిలి  మండలం కలవరాయిలో జిల్లా ఉన్నత పాఠశాల హెచ్‌ఎం  రాజు ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాలు అందించారు. ఆయా ప్రాంతాల్లో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-11T10:57:19+05:30 IST