గ్రామీణ బ్యాంకులపై వివక్ష తగదు
ABN , First Publish Date - 2020-12-12T05:18:28+05:30 IST
ఎస్‌బీఐ యాజమాన్యం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులపై పెత్తందారి తనాన్ని, వివక్షను విడనాడాలని ఏపీజీవీబీ ఎంప్లా ్లయీస్ యూనియన్ రీజనల్ అధ్యక్షుడు ఎం. రాంబాబు అన్నారు.
పార్వతీపురంటౌన్, డిసెంబరు 11: ఎస్‌బీఐ యాజమాన్యం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులపై పెత్తందారి తనాన్ని, వివక్షను విడనాడాలని ఏపీజీవీబీ ఎంప్లా ్లయీస్ యూనియన్ రీజనల్ అధ్యక్షుడు ఎం. రాంబాబు అన్నారు. శుక్రవారం స్థానిక బైపాస్‌రోడ్డులోని ఏపీజీవీబీ రీజనల్ కార్యాలయం వద్ద ప్రాంతీయ గ్రామీణ బ్యాం కులకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆల్ ఇండియా సమ్మెలో భాగంగా యూనియన్ సభ్యులు కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీజీవీబీలో ఉన్న దీర్ఘకాలిక, అపరిష్కృత డిమాండ్లను పరిష్క రించకపోతే సమ్మె తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రీజనల్ సెక్రటరీలు అప్ప లనాయుడు, హరిబాబు పాల్గొన్నారు.