108 శివలింగాలకు దీపార్చన
ABN , First Publish Date - 2020-12-14T05:24:27+05:30 IST
కార్తీక మాసం చివరి ఆదివారం సందర్భంగా తుమ్మికాపల్లి గేట్ సమీపంలోని ఓం సదనంలో ఆదివారం రాత్రి 108 శివలింగాలకు ప్రత్యేకంగా దీపార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓంసదనం నిర్వాహకుడు అంపోలు ఉమామహేశ్వర శర్మ ఆధ్వర్యంలో 108 శివలింగాలకు తొలుత అభిషేకాలను నిర్వహించి, అనంతరం ప్రతి లింగానికి ప్రత్యేకంగా దీపార్చన చేపట్టారు.

కొత్తవలస : కార్తీక మాసం చివరి ఆదివారం సందర్భంగా తుమ్మికాపల్లి గేట్ సమీపంలోని ఓం సదనంలో ఆదివారం రాత్రి 108 శివలింగాలకు ప్రత్యేకంగా దీపార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓంసదనం నిర్వాహకుడు అంపోలు ఉమామహేశ్వర శర్మ ఆధ్వర్యంలో 108 శివలింగాలకు తొలుత అభిషేకాలను నిర్వహించి, అనంతరం ప్రతి లింగానికి ప్రత్యేకంగా దీపార్చన చేపట్టారు. కార్తీక మా సం తొలిరోజు నుంచి చివరి రోజు వరకు సదనంలోని 108 శివలింగాలు, మహా లింగానికి ప్రతి రోజు సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యా భిషేకాలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో అర్చకులు వేమకోటి జగన్నాఽథశర్మ, అంపోలు కిరణ్ కుమార్ శర్మ పాల్గొన్నారు.