-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Dharna to implement GO No3
-
జీవో నెం.3 అమలు చేయాలని ధర్నా
ABN , First Publish Date - 2020-12-29T05:16:02+05:30 IST
జీవో నెంబరు 3ను అమలు చేయాలని కోరుతూ గిరిజనులు ఆయా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం కొమరాడ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.

కొమరాడ, డిసెంబరు 28: జీవో నెంబరు 3ను అమలు చేయాలని కోరుతూ గిరిజనులు ఆయా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం కొమరాడ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. మండలంలో నివసించే ప్రతి గిరిజనుడికి ఏజెన్సీ ధ్రువపత్రం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను రెవెన్యూ అధికారులు అంగీకరించకపోవడంతో గిరిజనులు రాత్రి వరకు ధర్నా కొనసాగించారు. చలి తీవ్రత ఎక్కవగా ఉండటంలో మంటలు వేసుకొని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న పార్వతీపురం డీఎస్పీ సుబాష్, సీఐ లక్ష్మణరావు తహసీల్దార్ కార్యాలయంలో ధర్నా చేపడుతున్న గిరిజన సంఘాలతో చర్చిలు జరిపి, శాంతి భద్రతలు సమీక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు గిరిజన సంఘ నాయకులు, గిరిజనులు పాల్గొన్నారు.