14న సబ్ కలెక్టరేట్ ఎదుట ధర్నా
ABN , First Publish Date - 2020-12-12T05:09:09+05:30 IST
వ్యవసాయ బిల్లులను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14 న సబ్‌కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించను న్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీరామ్మూర్తి తెలిపారు.
బొబ్బిలి: వ్యవసాయ బిల్లులను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14 న సబ్‌కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించను న్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీరామ్మూర్తి తెలిపారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో శుక్రవారం ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ధర్నాలో 15మండలాలకు చెందిన రైతులంతా పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీపీఎం నాయకులు రెడ్డి వేణు, అవినాష్, మన్మథరావు, ఇందిర, చిన్నంనాయుడు పాల్గొన్నారు.