నిరంతర పర్యవేక్షణ తప్పనిసరి
ABN , First Publish Date - 2020-09-14T09:28:15+05:30 IST
ఆలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశించారు.
జూమ్ వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడి
విజయనగరం క్రైమ్, సెప్టెంబరు 13: ఆలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశించారు. ఆదివారం జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎస్పీలు, కమిషన్లు, ఐజీలు అన్ని పోలీస్ స్టేషన్ల పోలీస్ అధికారులతో మాట్లాడారు. ఆలయాలు, ప్రార్థనా మందిరాల భద్రతను దృష్టిలో పెట్టుకుని నిరంతరం పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎటువంటి దాడులు జరగకుండా చూడాలన్నారు.
చేపట్టిన భద్రతా చర్యలను జయో ట్యాగింగ్ చేయాలని సూచించారు. ప్రార్థనా మందిరాల వద్ద దురదృష్టవశాత్తు జరిగే అవాంఛనీయ సంఘటనలకు నిర్వాహకులే బాధ్యత వహించాలన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అనంతరం ఎస్పీ రాజకుమారి జిల్లా పోలీస్ అధికారులతో మాట్లాడుతూ... ప్రజల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ప్రవర్తించే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. భద్రతను పర్యవేక్షించడంలో నిర్లక్ష్యం ప్రదర్శించే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.