పఠనాసక్తి పెంపొందించుకోండి

ABN , First Publish Date - 2020-12-07T04:37:48+05:30 IST

విద్యార్థుల్లో పఠనాసక్తి పెంపొందించేందుకే ప్రభుత్వం ‘చదవడం మాకిష్టం’ కార్యక్రమం నిర్వహిస్తోందని డీఈవో నాగమణి తెలపారు.

పఠనాసక్తి పెంపొందించుకోండి
విజయనగరంలో ‘చదవడం మాకిష్టం’ పోస్టర్‌ను విడుదల చేస్తున్న డీఈవో నాగమణి, తదితరులు

బాబామెట్ట :  విద్యార్థుల్లో పఠనాసక్తి పెంపొందించేందుకే ప్రభుత్వం  ‘చదవడం మాకిష్టం’ కార్యక్రమం నిర్వహిస్తోందని డీఈవో నాగమణి  తెలపారు. ఆదివారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో  ‘చదవడం మాకిష్టం’  పోస్టర్‌ను విడుదల చేశారు.  ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ.. మహనీయుల జీవిత గాథలు, నీతి కథలు , సాహిత్యం మొదలగు పుస్తకాలను ప్రతిఒక్కరూ చదవాలన్నారు.  ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రంథాల యాల్లో నిర్వహిస్తారన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంఽథాలయ సంస్థ కార్యాదర్శి ఎన్‌.లలిత, నాగవల్లి , ఏఎంవో అప్పారావు, విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు.   గరుగుబిల్లి: విద్యార్థులు పుస్తక పఠనంపై శ్రద్ధ చూపాలని మండల శాఖ గ్రంథాలయ నిర్వాహకుడు నల్ల మధుసూదనరావు సూచించారు.   మండల కేంద్రం లో ‘చదవడం మాకిష్టం’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.   జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆదేశాల మేరకు ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభించామన్నారు.    మాజీ పీఏసీఎస్‌ చైర్మన్‌ ఎన్‌.శివున్నాయుడు, తదితరులు పాల్గొన్నారు.  బొబ్బిలి రూరల్‌: విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులకూ  పఠనాసక్తి ఉండాలని  బొబ్బిలి సీఐ కేశవరావు తెలిపారు.   నారాయణప్పవలస ప్రాథమికోన్నత పాఠశాలలో  సండే స్టోరీ టైం అనే కార్యక్రమాన్ని  ప్రారంభించారు.  ఖాళీ సమయాన్ని వృథా చేసుకోకుండా పఠనంపై ఉపాధ్యాయులు విద్యార్థులను చైతన్యపరచాలని ఆయన సూచించారు.  చదువుతో పాటు క్రీడలపై అభిలాష కలిగేలా చూడాల న్నారు.  సచివాలయ సిబ్బంది, వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.  రామభద్రపురం: విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం రూపొందించిందని కారుణ్య ఫౌండేషన్‌ చైర్మన్‌, ఉపాధ్యాయ సంఘ నాయకులు జేసీ రాజు తెలిపారు. స్థానిక శాఖా గ్రంథాలయంలో  ‘చదవడం-మాకిష్టం’ అనే కార్యక్రమం నిర్వహించారు.  ప్రతి ఆదివారం 3 నుంచి 10వ తరగతి  విద్యార్థులకు సామూహిక పఠనంపై శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు.  దీనిని సండే స్టోరీ టైంగా పిలుస్తారని తెలిపారు.  ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని లైబ్రేరియన్‌ కృష్ణమూర్తి కోరారు.  నెల్లిమర్ల:  జరజాపుపేటలోని గ్రామీణ గ్రంథాలయంలో విద్యార్థులు, యువకులతో పలు పుస్తకాలు చదివించారు.   గ్రంథాలయ నిర్వాహకులు జీనపాటి నారాయణ, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.  డెంకాడ:   డెంకాడ శాఖా గ్రంథాలయంలో ‘కనువిప్పు’ అనే కథను పిల్లలతో చదివించారు.   పుస్తక పఠనం ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయొచ్చని విజయనగరం డైట్‌ కళాశాల లెక్చలర్‌ బి.భారతి తెలిపారు. గ్రంథాలయాధికారి బి.రామభద్రరాజు, డెంకాడ జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.  మక్కువ: పుస్తక పఠనంతో విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని గ్రంథాలయ అధికారి ఆర్‌.లక్ష్మణరావు అన్నారు. స్థానిక శాఖ గ్రంథాలయంలో నిర్వహించిన ‘చదవడం మాకిష్టం’ కార్యక్రమంలో విద్యార్థులు, పాఠకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


  

 

Read more