చీకటి జీవోలతో విద్యార్థుల భవిష్యత్తు నాశనం

ABN , First Publish Date - 2020-11-28T04:57:34+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చీకటి జీవోలతో మాన్సాస్‌ ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న 12 విద్యా సంస్థలకు సంబం ధించి విద్యార్థుల భవిష్యత్‌ అగమ్య గోచరంగా మారుతుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కరణం శివరామకృష్ణ అన్నారు.

చీకటి జీవోలతో విద్యార్థుల భవిష్యత్తు నాశనం
సంతకాల సేకరణ చేపడుతున్న శివరామకృష్ణ

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శివరామకృష్ణ

గజపతినగరం, నవంబరు 27: రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చీకటి జీవోలతో మాన్సాస్‌ ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న 12 విద్యా సంస్థలకు సంబం ధించి విద్యార్థుల భవిష్యత్‌ అగమ్య గోచరంగా మారుతుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కరణం శివరామకృష్ణ అన్నారు. ఈమేరకు పట్టణంలో శుక్రవారం సంతకాల సేకరణ చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతం పై ఏమాత్రం అవగాహన లేని వ్యక్తిని చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జిల్లా వాసుల దురదృష్టకరమన్నారు. కార్యక్రమంలో మాజీ వైస్‌ ఎంపీపీ కనకల పోలినాయుడు, మాజీ సర్పంచ్‌లు గోవింద, రమణ, చిన్నంనాయుడు, అప్పలనాయుడు పాల్గొన్నారు.

Read more