పరిశ్రమలకు ప్రోత్సాహంతోనే అభివృద్ధి
ABN , First Publish Date - 2020-05-29T09:54:00+05:30 IST
పరిశ్రమలకు ప్రోత్సాహంతోనే అభి వృద్ధి సాధ్యమని ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి తెలిపారు.

ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి వెల్లడి
విజయనగరం-ఆంధ్రజ్యోతి, మే28: పరిశ్రమలకు ప్రోత్సాహంతోనే అభి వృద్ధి సాధ్యమని ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి తెలిపారు. సీఎం జగన్ కూడా వాటికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. గురువారం జరిగిన మన పాలన-మీ సూచన సదస్సులో భాగంగా డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో మాట్లాడారు. తొలుత డీఆర్‌డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చిన్న పరిశ్రమల స్టాల్స్‌ను పరిశీలించారు. జిల్లాలో చిన్న పరిశ్రమలకు తొలివిడత రాయితీలుగా రూ.13.82 కోట్లు విడుదల చేసిన విషయాన్ని స్పష్టం చేశారు. ఉగ్యోగావకాశాలు కల్పించేం దుకు ప్రయత్నిస్తున్నామన్నారు. జిల్లాలో రోడ్డు, రైల్వే రవాణా సదుపాయాలుండగా, పరిశ్రమలకు అనువైన వాతావరణం ఉందని, ఔత్సాహికులు ముందుకు రావాలని కోరారు. కలెక్టర్ హరి జవహర్‌లాల్ మాట్లాడుతూ.. రానున్న రోజులో పెద్ద ఎత్తున నిర్మాణ రంగ పనులు చేపట్టాల్సి ఉందన్నారు.
రూ.400 కోట్లతో ఉపాధి కన్వర్జెన్సీ పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. జిల్లాలో ఉన్నత విద్యా సంస్థల నిర్మాణాలు చేపట్టనున్నామన్నారు. బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి మాట్లాడుతూ చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసేవారికి అధిక ప్రోత్సాహ కాలున్నాయన్నారు. పరిశ్రమల కేంద్ర జీఎం ప్రసాద్ మాట్లాడుతూ తొలివిడతగా రూ.60 పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. గనులశాఖ సహాయ సంచాలకులు ఎస్‌వీ రమణ మాట్లాడుతూ జిల్లాలో మాంగనీస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ట్రైనీ కలెక్టర్ కట్టా సింహాచలం, విద్యుద్ శాఖ ఎస్‌ఈ విష్ణు, హౌసింగ్ పీడీ రమణమూర్తి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ విజయశ్రీ, పీఆర్‌ఎస్‌ఈ విజయకుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.