రాష్ట్రంలో రాక్షస పాలన

ABN , First Publish Date - 2020-12-31T05:21:19+05:30 IST

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని ఉత్తరాంధ్ర టీడీపీ ఇన్‌ చార్జి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. బుధవారం ఆయన రామతీర్థం వ చ్చిన సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. సీఎం జగన్‌ పాలన, విజయసాయిరెడ్డి తీరుపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. కక్ష సాధింపులకే అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో రాక్షస పాలన
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న

టీడీపీకి పూర్వవైభవం తెస్తా...

పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న             

నెల్లిమర్ల : రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని ఉత్తరాంధ్ర టీడీపీ ఇన్‌ చార్జి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. బుధవారం ఆయన రామతీర్థం వ చ్చిన సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. సీఎం జగన్‌ పాలన, విజయసాయిరెడ్డి తీరుపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. కక్ష సాధింపులకే అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. దీన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నార న్నారు. ఎన్నడూ లేనివిధంగా హిందూ ఆలయాలపై దాడులు పెరగడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నా రు. ఉత్తరాంధ్రలో టీడీపీకి పూర్వవైభవం తెచ్చేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. సంక్షేమం పే రుతో రాష్ట్రాన్ని అప్పులపాల జేస్తు న్నారని..  మిగతా రంగాల అభివృ ద్ధి శూన్యమని.. భవిష్యత్తులో రాష్ట్ర పరిస్థితి తలచుకుంటే భయమేస్తుం దని ఆవేదన వ్యక్తం చేశారు. కొం తమంది అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్నారని, చివరి కి కోర్టులను కూడా తప్పుదోవ పట్టిస్తుండడం దరదృష్టకరమన్నారు. వచ్చే నెల 18 నుంచి ఉత్తరాంధ్రలో పర్యటిస్తానని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చేరేలా ప్రార్టీ శ్రేణులతో కలసి ముందుకు వెళ్తానన్నారు. 


Updated Date - 2020-12-31T05:21:19+05:30 IST