పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌

ABN , First Publish Date - 2020-05-09T09:34:26+05:30 IST

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కోట అప్పన్న డిమాండ్‌ చేశారు

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌

బొబ్బిలి రూరల్‌, మే 8: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కోట అప్పన్న డిమాండ్‌ చేశారు.  కృపావలసలో శుక్రవారం ఆయన నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా విపత్తు సమయంలో దేశ ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్రం నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందన్నారు.


కేంద్ర సర్కార్‌ విధానాలు దేశ మనుగడను దెబ్బతీసే విధంగా ఉన్నాయని, ఉత్పత్తి రంగం పడిపోయిందని తెలిపారు. చిన్న పరిశ్రమలు,  వ్యాపారాలు దెబ్బతినగా, లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయారని విమర్శించారు. తక్షణమే పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర వస్తువుల ధరలు దగ్గించాలని డిమాండ్‌ చేశారు.  ఏఐవైఎఫ్‌ జిల్లా సమితి సభ్యులు సీహెచ్‌.సీతయ్య, రాజు, మహేష్‌ తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-05-09T09:34:26+05:30 IST