3,346 మంది రైతులకు పంటల బీమా

ABN , First Publish Date - 2020-12-16T05:22:23+05:30 IST

వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా పథకం కింద జిల్లాలో 3,346 మంది రైతులకు రూ.2.96 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం మంజూరు చేశారు.

3,346 మంది రైతులకు పంటల బీమా
అధికారుల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌

కలెక్టరేట్‌, డిసెంబరు 15 : వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా పథకం కింద జిల్లాలో 3,346 మంది రైతులకు రూ.2.96 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం మంజూరు చేశారు. ఈ మేరకు మంగళవారం అన్నదాతల ఖాతాలకు ఆ మొత్తాన్ని జమ చేశారు. కలెక్టరేట్‌లో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 9.48 లక్షల మందికి రూ.1252 కోట్లు  అందించా మన్నారు.  విజయనగరం నుంచి వరి, వేరుశనగ, చెరకు, అరటి, పంటలకు బీమా వర్తింపజేసినట్లు చెప్పారు.  రైతు ఒక్క రూపాయి చెల్లిస్తే మిగిలిన ప్రీమియాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో  ఎమ్మెల్సీ సురేష్‌బాబు, కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌, జేసీ కిషోర్‌ కుమార్‌,  వ్యవసాయ శాఖ జేడీ ఆశాదేవి తదితరులు ఉన్నారు.

 పథకాల అమలుకు ప్రత్యేక ప్రణాళిక  

 విజయనగరం (ఆంధ్రజ్యోతి) : ప్రత్యేక ప్రణాళికతో సంక్షేమ పథకాలు అమలు చేయాలని  కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ ఆదేశించారు. మంగళవారం డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగనన్న తోడు , వైఎస్‌ఆర్‌ బీమా,  చేయూత వంటి పథకాల అమలులో నిర్లక్ష్యాన్ని వీడాలన్నారు. పక్కా వ్యూహంతో యూనిట్లను స్థాపించి యుద్ధప్రాతిపదికన ప్రజలకు అందించాలని తెలిపారు.  ఈ మొత్తం వ్యవహారాన్ని జిల్లా అధికారులతో కూడిన కోర్‌ టీం  పర్యవేక్షిస్తుంద న్నారు. క్షేత్రస్థాయిలో మండలాలకు ఐటీడీఏ పీవో, జేసీ, సబ్‌కలెక్టర్‌ , అసిస్టెంట్‌ కలెక్టర్‌, ఆర్డీవో, డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ అధికారులను  ప్రత్యేక పర్యవేక్షణాధి కారులుగా నియమిస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా  ప్రతి గంటకు సమీక్ష ఉంటుందని వెల్లడించారు.  వారంతా నేరుగా ఆయా బ్యాంకు అధికారులతో మాట్లాడి, యూనిట్ల గ్రౌండింగ్‌కు కృషిచేస్తారన్నారు.   జిల్లా కేంద్రం నుంచి ఒక కోర్‌టీమ్‌ ఉదయం-9 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు సిద్ధంగా ఉంటుందని తెలిపారు.  క్రైసిస్‌ మేనేజ్‌మెంట్‌ టీమ్‌ ఆధ్వర్యంలో , ఆయా శాఖల సిబ్బంది సైతం కంట్రోల్‌ రూములో అందుబాటులో ఉంటారని  చెప్పారు. మొత్తం కార్యక్రమాన్ని జేసీ మహేష్‌కుమార్‌ పర్యవేక్షిస్తారని తెలిపారు.  సమావేశంలో జేసీ వెంకటరావు, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సింహాచలం, డీఆర్‌డీఏ పీడీ సుబ్బారావు, మోప్మా పీడీ సుగణాకరరావు పాల్గొన్నారు. 


 

 

Updated Date - 2020-12-16T05:22:23+05:30 IST