-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Couples made nominations
-
నామినేషన్లు వేసిన దంపతులు
ABN , First Publish Date - 2020-03-13T11:18:30+05:30 IST
మునిసిపల్ ఎన్నికల్లో పోటీచేసేందుకు గాను రెండు ప్రధాన పార్టీల తరఫున కొన్ని చోట్ల దంపతులు నామినేషన్లు

బొబ్బిలి మార్చి 12: మునిసిపల్ ఎన్నికల్లో పోటీచేసేందుకు గాను రెండు ప్రధాన పార్టీల తరఫున కొన్ని చోట్ల దంపతులు నామినేషన్లు వేశారు. వీరిలో 19 వ వార్డు నుంచి మాజీ కౌన్సిలర్లు చెలికాని మురళి, ఆయన సతీమణి సంధ్య వైసీపీ తరఫున గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. గొల్లపల్లిలోని 11వ వార్డు నుంచి టీడీపీ తరఫున మాజీ కౌన్సిలర్లు బొబ్బాది తవిటినాయుడు ఆయన సతీమణి సరస్వతి కలిసి నామినేషన్లు వేశారు. మరో మాజీ కౌన్సిలర్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు రాంబార్కి శరత్‌బాబు 8 వ వార్డుకు, ఆయన సతీమణి రేణుక దేవిస్వప్న ఏడో వార్డు నుంచి నామినేషన్ వేశారు. మల్లమ్మపేటలో 24 వ వార్డు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా తెంటు శివఅప్పలనాయుడు నామినేషన్ వేశారు. ఆయన సతీమణి , మాజీ కౌన్సిలరు తెంటు పార్వతి శుక్రవారం ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు.