ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో అవినీతి
ABN , First Publish Date - 2020-07-08T11:43:19+05:30 IST
రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందిస్తున్నామంటున్న వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తమ గ్రామంలో జరుగుతున్న

శృంగవరపుకోట రూరల్ (జామి) జూలై 7: రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందిస్తున్నామంటున్న వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తమ గ్రామంలో జరుగుతున్న అవినీతిని చూసి ఏం సమాధానం చెబుతారని అలమండ టీడీపీ నాయకులు, గ్రామస్థులు ప్రశ్నించారు. నాలుగేళ్ల క్రితం నిర్మించి పేదలకు ఇవ్వకుండా వదిలేసిన 164 హుద్‌హుద్ ఇళ్లను వెంటనే పేదలకు కేటాయించాలని, తమ గ్రామంలో అనర్హులకు కట్టబెట్టేందుకు సిద్ధం చేసిన ఇళ్ల స్థలాలపై విచారణ చేపట్టాలని మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా లగుడు రవికుమార్, రామయ్యపాలెం మాజీ సర్పంచ్ మాకిరెడ్డి శ్రీలక్ష్మి, రాయవరపు శ్రీను, ఎన్నింటిఅప్పలరాజు, కొత్తల సూర్యారావు, వర్రి రమణ, దనియాల పైడిరాజు తదితరులు మాట్లాడుతూ హుద్‌హుద్ సమయంలో సర్వం కోల్పోయిన పేదలకు తెలుగుదేశం ప్రభుత్వం ఇళ్లులు కట్టిస్తే ఆప్పట్లో వైసీపీ నాయకులు కోర్టులో కేసులు వేసి ఆడ్డుకున్నారని దీనిపై న్యాయపోరాటం చేస్తున్నామన్నారు.