ఆపత్కాలం.. అలుపెరగని సాయం

ABN , First Publish Date - 2020-05-10T08:22:16+05:30 IST

కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపడుతోందని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ తెలిపారు.

ఆపత్కాలం.. అలుపెరగని సాయం

విజయనగరం క్రైం, మే 9 : కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపడుతోందని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ తెలిపారు. నగరంలోని స్టేడియం పేటలో పేదలకు శనివారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆపత్కాలంలో ప్రజలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సర్కార్‌ చేస్తోందన్నారు. విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనలో మరణించిన వారికి రూ.కోటి  వంతున మంజూరు చేయడం గొప్ప విషయమని తెలిపారు. పట్ణణ పెట్రోల్‌ బంక్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో  ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి,  అసోసియేషన్‌ ప్రతినిఽధి నాగిరెడ్డి, పార్టీ నేతలు దుప్పాడ సునీత, నాగబాబు, అంజి, పైడి, ఏడుకొండలు పాల్గొన్నారు.


చీపురుపల్లి: స్థానిక వైసీపీ కార్యాలయంలో శనివారం అర్చకులు, ఆర్‌డబ్ల్యూఎస్‌ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, ఆర్‌ఈసీఎస్‌ క్షేత్ర సిబ్బంది తదితరులకు ఎంపీ సతీమణి బెల్లాన శ్రీదేవి నిత్యాసర సరుకులు పంపిణీ చేశారు.  పార్టీ నాయకులు ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, ఆలయ కమిటీ చైర్మెన్‌ ఇప్పిలి గోవిందరావు, పతివాడ రాజారావు తదితరులున్నారు. ఫ బొబ్బిలి రూరల్‌:  కోమటిపల్లి, కుమందానపేట గ్రామాల్లో 1200 మంది పేదలకు పేదలకు  మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ బేబీనాయన చేతులమీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. రంగరాయపురంలో సీపీఎం ఆధ్వర్యంలో 50 మంది పేదలకు 8 రకాల నిత్యావసరాలు అందించారు.   కార్యక్రమంలో గొట్టాపు సత్యం, సీపీఎం జిల్లా నాయకులు రెడ్డి వేణు, ఉడుముల భూషణ, ఇందిర, పుణ్యవతి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-10T08:22:16+05:30 IST