కరోనా నిబంధనలు పాటించాలి

ABN , First Publish Date - 2020-12-16T05:27:32+05:30 IST

రైతు బజార్లలో కూరగాయలు విక్రయించే రైతులు, వినియోగదారులు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని ఎస్టేట్‌ అధికారి అప్పలనాయుడు కోరారు.

కరోనా నిబంధనలు పాటించాలి
ప్లకార్డులతో అవగాహన కల్పిస్తున్న దృశ్యం

విజయనగరం దాసన్నపేట: రైతు బజార్లలో కూరగాయలు విక్రయించే రైతులు, వినియోగదారులు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని  ఎస్టేట్‌ అధికారి అప్పలనాయుడు కోరారు. మంగళవారం పాత మహారాజా ఆసుపత్రి రైతు బజారు ఆవరణలో ప్లకార్డులతో కరోనాపై అవగాహన కల్పించారు.  మార్కెట్‌ కమిటీ ఏడీ ఆదేశాల మేరకు రైతు బజార్లలో  50 రోజుల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.  రైతులు, సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూప్‌ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. 

 

Updated Date - 2020-12-16T05:27:32+05:30 IST