-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Corona
-
కరోనాపై అప్రమత్తం
ABN , First Publish Date - 2020-03-13T11:09:15+05:30 IST
కరోనాపై అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో రమణకుమారి వైద్యాధికారు లకు సూచించారు. ఈవ్యాధికి

43 ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులు
కలెక్టరేట్‌లో హెల్ప్‌లైన్ కేంద్రం
డీఎంహెచ్‌వో రమణ కుమారి
రింగురోడ్డు, మార్చి 12: కరోనాపై అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో రమణకుమారి వైద్యాధికారు లకు సూచించారు. ఈవ్యాధికి చికిత్స అందించేందుకు గాను జిల్లాలోని 41 ప్రైవేట్ ఆసుపత్రులతో పాటు జిల్లా కేంద్రాసుపత్రి, పార్వతీపురం ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులు సిద్ధం చేశామని తెలిపారు. గురువారం జిల్లా వైద్యఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆమె వైద్యాధికారులతో సమీక్షించారు. జిల్లా కేంద్రాసుపత్రి, పార్వతీపురం ఏరియాసుపత్రిలో పది పడకలతో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేశామని తెలిపారు. క్షేత్రస్థాయిలో కరోనా వైరస్‌పై అవగాహనకు కరపత్రాలు, పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లోనూ అవగాహన సదస్సులను నిర్వహించాలని సూచించారు. ఇతర దేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారి వివరాలను సంబందిత వైద్య అధికారులకు తెలియ పరిచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఎన్95 మాస్కు లు, పిపిఈ-కిట్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ వ్యాధి లక్షణాలు ఉన్నవారిని ఆసుపత్రికి తీసుకురావ డానికి ఆరోగ్య శాఖ కార్యాలయంలో రెండు ఆంబు లెన్సులు, రెండు 104 వాహనాలను సిద్ధంగా ఉంచామని తెలిపారు. ఇప్పటికే శానిటరీ, పారామెడికల్ సిబ్బందికి వైద్యాధికారులచే శిక్షణ ఇప్పించామన్నారు. బస్టాండ్, రైల్వేస్టేషన్లలో కరోనా వ్యాప్తి నిరోధక చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.
ఎక్కువ రోజులు జలుబు, దగ్గు, తీవ్రమైన జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగితే అశ్రద్ధ చేయకుండా ఆసుపత్రుల్లో సంప్రదించాలని సూచించారు. కరోనా ప్రబలకుండా తరుచుగా చేతులు శుభ్రం చేసుకోవడం, దగ్గినప్పుడు, తుమ్మినపుడు నోటికి, ముక్కుకి, చేతిరుమాలు అడ్డంగా పెట్టుకోవాలని ప్రజలకు వివరించాలన్నారు. బయట కి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా ముఖా నికి మాస్కులు ధరించాలన్నారు. కరో నాపై ప్రజలకు అవగాహన కల్పించేం దుకు గాను కలెక్టరేట్‌లో 24 గంటల హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశా మని చెప్పారు. ఏమైనా సందేహలు ఉంటే 08922 236937 నంబరుకు సంప్రదించాలన్నారు.
చికెన్, గుడ్లు తింటే కరోనా రాదు: జేడీ
కోడిమాంసం, గుడ్లు తినడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందదని పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకుడు ఏవీ నర్సింహులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటిని తింటే కరోనా వస్తుందన్నది వదంతి మాత్రమేనని, ఇందులో వాస్తవం లేదన్నారు. మనుషుల ద్వారా మాత్రమే ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని తెలిపారు. ప్రపంచంలో ఇప్పటి వరకూ జంతువుల ద్వారా కరోనా వైరస్ సోకిన కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదన్నారు. చికెన్, గుడ్లు తినడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్లు లభిస్తాయని తెలిపారు.