గ్రామకంఠంపై వివాదం

ABN , First Publish Date - 2020-12-07T04:44:32+05:30 IST

చింతలపేట గ్రామకంఠం విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం నెలకొంది.

గ్రామకంఠంపై వివాదం
చింతలపేటలో తహసీల్దార్‌ ,స్థానికుల మధ్య వాగ్వాదం


గుర్ల, డిసెంబరు 6:  చింతలపేట గ్రామకంఠం విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం నెలకొంది. మొత్తంగా 60 సెంట్ల విస్తీర్ణంలో 20 సెంట్లలో నిర్మాణాలు చేపట్టడంపై  ఓ వర్గం నేతలు రెవెన్యూ శాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆదివారం తహసీల్దార్‌ లావణ్య, మండల అధికారులు, సర్వేయర్లు , సచివాలయ ఉద్యోగులు, పోలీసులు ఆ స్థలాన్ని పరిశీలించారు. ఆ ప్రాంతంలో స్థానికులు వేసిన పునాదులను తవ్వేశారు. గ్రామకంఠంలో నిర్మాణాలు చేపట్టరాదని వారు హెచ్చరించారు. తమ పూర్వీకుల నుంచి ఈ  స్థలంలో  పశువుల శాలలు , ఇళ్లు నిర్మించుకుని ఉంటే.. ఇప్పుడు అధికారులు అభ్యంతరం తెలపడం తగదని ఆ ప్రాంత వాసులు తెలిపారు.  దీంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అక్కడ బోర్డులు ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నించగా మహిళలు అడ్డుకున్నారు. దీంతో రెవెన్యూ సిబ్బంది, పోలీసులు వెనుదిరిగారు. ఉన్నతాధికారులకు నివేదిక అందజేసి తదుపరి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌  లావణ్య  తెలిపారు. 

 

 

 

Updated Date - 2020-12-07T04:44:32+05:30 IST