జిల్లాలో త్వరలో వైద్య కళాశాల నిర్మాణం

ABN , First Publish Date - 2020-02-12T10:28:53+05:30 IST

జిల్లాలో త్వరలోనే ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని రాష్ట్ర వై ద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి

జిల్లాలో త్వరలో వైద్య కళాశాల నిర్మాణం

1100 కోట్లతో సబ్‌ సెంటర్లకు భవనాలు

ప్రతి మండలానికి 104, 108 వాహనాలు

వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి జవహర్‌రెడ్డి


పార్వతీపురం, ఫిబ్రవరి 11: జిల్లాలో త్వరలోనే ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని రాష్ట్ర వై ద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి చెప్పారు. మంగ ళవారం పార్వతీపురంలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ఆయ న విలేకరులతో మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని ఘోషాసుపత్రి లో వైద్యుల సేవలు అభినందనీయమన్నారు. జిల్లాలోని ఏరియా ఆసుపత్రుల అప్‌గ్రేడింగ్‌ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్య లు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో విజయనగరం, విశా ఖపట్నం జిల్లాలతో పాటు ఇతర జిల్లాల్లోనూ వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వాటికి అనుసంధానంగా అవసర మైన ఆధునికీకరణ పనులు రూ.8వేల కోట్లతో చేపట్టనున్నామని తెలిపారు. రాష్ట్రంలో 7500 సబ్‌ సెంటర్లు ఉన్నాయని, ఇందులో 2500 సబ్‌ సెంటర్లకు మాత్రమే పక్కా భవనాలు ఉన్నాయన్నా రు. మిగతా వాటికి రూ.1100కోట్లతో కొత్తభవనాలు నిర్మిస్తామని తెలిపారు. నాడు - నేడు కార్యక్రమం ద్వారా ఈ పనులు జరుగు తాయని, టెండర్లు కూడా పిలిచామన్నారు. వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న వైద్యులు, స్టాఫ్‌నర్సులు, ఫార్మసిస్టులు, తదితర పోస్టుల భర్తీకి మే నెలలో నోటిఫికేషన్‌ విడుదల చేస్తామన్నారు. ప్రతి పీహెచ్‌సీలో కనీసం ఇద్దరు వైద్యులు ఉండేలా, రద్దీగా పీహెచ్‌సీల్లో ముగ్గురు వైద్యులు ఉండేలా చర్యలు తీసుకుం టామని తెలిపారు.


ప్రతి మండలానికి అత్యవసర వాహనాలు

108, 104 వాహనాలను ప్రతి మండలానికి ఒకటి చొప్పున కేటాయిస్తామని జవహర్‌రెడ్డి తెలిపారు. మార్చి 30 నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. ఆసుపత్రుల నుంచి మరో ఆసుపత్రికి చిన్న పిల్లలను తరలించేందుకు ప్రత్యేక అంబులెన్సు ను ఏర్పాటు చేస్తామన్నారు. 


ఈనెలలో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ

130 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను అందిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి జవహర్‌రెడ్డి తెలిపారు. ఈనెలలో 1.4 లక్షల మందికి ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేస్తామన్నారు. ఆసుపత్రుల్లో వైద్యం పొందే రోగులకు రోజుకు రూ.225లు చొప్పున వ్యాధిని బట్టి ఇస్తామన్నారు. వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు పథకం ద్వారా 1.50 లక్షల మందిలో ఇప్పటివరకు 60 వేల మందికి కళ్లాద్దా లు పంపిణీ చేశామని, త్వరలో మిగతా వారికి అందజేస్తామని తెలిపారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌, సబ్‌ కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌, ఐటీడీఏ పీవో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ జి.నాగభూషణరావు, డీఎంహెచ్‌వో ఎస్వీ రమణకుమారి, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ రవికుమార్‌రెడ్డి పాల్గొన్నారు.


రామభద్రపురం పీహెచ్‌సీ సందర్శన

రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని  వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి సందర్శించారు. రోగులకు అందిస్తున్న సేవలు, తదితర అంశాలపై వైద్యాధికారి ఎంకేవీ సంజీవనాయుడును అడిగి తెలుసుకున్నారు. 2011లో స్టాఫ్‌నర్సులుగా నియమితులైన వారికి రెగ్యులర్‌ చేయాలని స్టాఫ్‌నర్సు లక్ష్మి ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. త్వరలో జరగనున్న పోస్టుల ఎంపికలో వెయిటేజీ మార్కులు ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది 249 సబ్‌సెంటర్లకు పక్కా భవనాలు నిర్మిస్తామన్నారు.

Updated Date - 2020-02-12T10:28:53+05:30 IST