‘ఆటో మ్యూటేషన్‌ సేవల్లో మనమే టాప్‌’

ABN , First Publish Date - 2020-06-26T11:51:07+05:30 IST

భూమార్పిడి(ఆటో మ్యూటేషన్‌)సేవల్లో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. వచ్చిన దరఖాస్తుల్లో 99 శాతం వరకూ తహసీల్దార్లు 8 నోటీసులు జనరేట్‌

‘ఆటో మ్యూటేషన్‌ సేవల్లో మనమే టాప్‌’

రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిన జిల్లా

తహసీల్దార్లకు కలెక్టర్‌ అభినందనలు


కలెక్టరేట్‌,జూన్‌ 25: భూమార్పిడి(ఆటో మ్యూటేషన్‌)సేవల్లో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. వచ్చిన దరఖాస్తుల్లో 99 శాతం వరకూ తహసీల్దార్లు 8 నోటీసులు జనరేట్‌ చేశారు. గ్రామాల్లో ఎవరైనా భూమిని కొనుగోలు చేసుకునే వారు  ఆన్‌లైన్‌లో తన  పేరున మార్చేందుకు  మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసు కునేవారు. తరువాత ఆయా రెవెన్యూ కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్న పత్రాలను అందజేసేవారు. అన్ని పక్కాగా ఉంటే గ్రామంలోని పరిశీలించి తహసీల్దార్ల  సమ క్షంలో ఆన్‌లైన్‌ చేసేవారు.


అయితే  ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి సర్కార్‌ నూతన విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది.  దీని ప్రకారం భూమిని కొనుగోలు చేసుకున్న వ్యక్తి రిజిస్ర్టేషన్‌  చేసుకున్నప్పుడే నేరుగా మ్యూటేషన్‌ కోసం ఆయా తహసీల్దార్‌ కార్యాలయానికి దరఖాస్తు వెళ్తుంది. గత ఫిబ్రవరి నుంచి  జిల్లా వ్యాప్తంగా 3,243 దరఖాస్తులు రాగా, అందులో 2,256 దరఖాస్తులకు సంబంధించి తహసీల్దార్లు  8 నోటీసులు (99.17 శాతం) జనరేట్‌ చేశారు.   దీంతో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 660 దరఖాస్తులను మ్యూటేషన్‌ కోసం తహసీల్దార్లు  ఆమోదించారు. 15 దరఖాస్తులను తిరస్కరించారు. మొత్తంగా జిల్లా మొదటి స్థానంలో నిలవడంపై తహసీల్దార్లను కలెక్టర్‌ అభినందించారు. 

Updated Date - 2020-06-26T11:51:07+05:30 IST