అమ్మకు ఎంత కష్టం!
ABN , First Publish Date - 2020-08-11T10:14:27+05:30 IST
ఆస్పత్రికి చికిత్స కోసం వెళితే...కరోనా ‘నెగిటివ్’ రిపోర్టు తీసుకు రావాలని అంటున్నారు.

గర్భిణులు, బాలింతలకు అవస్థలు
కరోనా పరీక్షల కోసం గంటల తరబడి నిరీక్షణ
విజయనగరం (ఆంధ్రజ్యోతి): ఆస్పత్రికి చికిత్స కోసం వెళితే...కరోనా ‘నెగిటివ్’ రిపోర్టు తీసుకు రావాలని అంటున్నారు. ఈ పరీక్షల కోసం వెళితే గం టల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. కరోనా లేకపోయినా ‘పరీక్షలు’ తప్పడం లేదు. ఇదీ జిల్లాలోని గర్భిణుల దుస్థితి. జిల్లాలోని కొవిడ్ పరీక్ష కేంద్రాల్లో అందరికీ ఒకేచోట పరీక్షలు చేస్తున్నారు. ఈ క్యూలలో నిలుచోలేక గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే క్యూలలో ‘పాజిటివ్’ ఉన్న వారు కూడా పరీక్షలకు వెళుతున్నారు. పొరపాటున క్యూలో ఉన్న తోటివారి నుంచి వైరస్ సోకితే తమతో పాటు... కడుపులో ఉన్న బిడ్డల సంగతి ఏంటని గర్భిణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో గర్భిణులు 22,159 మంది, బాలింతలు 14,277 మంది ఉన్నట్టు అధికారికి లెక్కలు చెబు తున్నాయి. వీరి కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి కరోనా పరీక్ష లు నిర్వహిం చాలన్న డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. సాధారణ ఆరోగ్య పరీక్షల కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే.. అక్కడ కరో నా పరీక్షలు చేయించుకున్న ఆధా రాలు చూపించాలని అడుగుతు న్నారు.
అత్యవసర సమయాల్లో నూ ఇదే పరిస్థితి. దీంతో అందరి తో పాటే కరోనా పరీక్షల కోసం క్యూ కడుతున్నారు. తమ వంతు వచ్చే వరకూ ఎదు రుచూడాల్సి వస్తోంది. అందరితో కాకుండా గర్భిణులు, బాలిం తల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని మహిళలు కోరుతున్నారు. ఐద్వా జిల్లా అధ్యక్షులు పి.రమణమ్మ మాట్లా డుతూ గర్భిణుల కోసం ప్రత్యేకంగా కరోనా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విషయమై కేంద్రాసుపత్రి సూపరింటెండెంట్ కె.సీతారామరాజు మాట్లాడుతూ ఘోషా సుపత్రిలో గర్భిణులకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని పీహెచ్సీ, సీహెచ్సీల్లో ఇదే తరహాలో ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు.