1న భవన నిర్మాణ కార్మికుల ఆందోళన

ABN , First Publish Date - 2020-09-25T10:54:51+05:30 IST

1న భవన నిర్మాణ కార్మికుల ఆందోళన

1న భవన నిర్మాణ కార్మికుల ఆందోళన

బొబ్బిలి, సెప్టెంబరు 24 : కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్న భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ వచ్చే నెల 1న ఆందోళన చేపట్టనున్నట్టు సీఐటీయూ నాయకులు తెలిపారు. ఈ మేరకు గురువారం వారు మాట్లాడుతూ  పార్వతీపురం సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదుట చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సీఐటీయూ నాయకుడు శంకరరావు, భవననిర్మాణ సంఘం నాయకులు అచ్యుతరావు, మల్లేశ్వరరావు, సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2020-09-25T10:54:51+05:30 IST