నిర్మాణాలు పూర్తిచేయండి
ABN , First Publish Date - 2020-11-14T05:05:23+05:30 IST
ప్రభుత్వ భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని పార్వతీపురం ఐఈడీఏ పీవో ఆర్.కూర్మనాథ్ అన్నారు. చప్పబుచ్చింపేట సచివాలయ నిర్మాణ పనులను ఆయన శుక్రవారం పరిశీ లించారు.
ఐటీడీఏ పీవో కూర్మనాథ్
సచివాలయ భవన నిర్మాణాలను పరిశీలించిన అధికారులు
మక్కువ, నవంబరు 13: ప్రభుత్వ భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని పార్వతీపురం ఐఈడీఏ పీవో ఆర్.కూర్మనాథ్ అన్నారు. చప్పబుచ్చింపేట సచివాలయ నిర్మాణ పనులను ఆయన శుక్రవారం పరిశీ లించారు. ఈసందర్భంగా ఆయన సిబ్బందితో మాట్లాడు తూ సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ ఆదేశాలను, నియమాలను తప్పకుండా అనుసరించాలన్నారు. అనంత రం సిబ్బంది హాజరు పట్టి, ప్రగతి నివేదికలను పరిశీ లించారు. సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
రూ.30 కోట్లతో రహదారి నిర్మాణ పనులు
సాలూరు: ఐటీడీఏ పరిధిలో ప్రస్తుతం రూ.30 కోట్లతో రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నట్టు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కూర్మనాథ్ తెలిపారు. పట్టణంలో రామాకాలనీ, కోట వీధుల్లో ఉన్న సచివాలయాలను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈసందర్భంగా సచివాలయ సిబ్బందితో మాట్లాడా రు. వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ రూ.30 కోట్లతో రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నట్టు తెలిపారు. ఆర్‌వోఎఫ్‌ఆర్ కింద సుమారు 48 వేల ఎకరాలు గిరిజనులకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపా రు. పాచిపెంట నుంచి అరకు రోడ్డు పనులు చేపడుతున్నట్టు చెప్పారు. ఆయనతో పాటు మున్సిపల్ కమిషనర్ రమణమూర్తి, మేనేజర్ జయరాం, పలువురు అధికారులు పాల్గొన్నారు.