కార్యాలయాల నిర్మాణ పనులు పూర్తిచేయండి

ABN , First Publish Date - 2020-08-22T09:17:26+05:30 IST

నిర్మాణ దశలో ఉన్న కార్యాలయాల పనులను త్వరితగతిన పూర్తి చేయా లని ఏజేసీ వెంకటరావు ఉధికారులకు సూచించా రు. కొళ్లాయి వలస గ్రామంలో నిర్మి

కార్యాలయాల నిర్మాణ పనులు పూర్తిచేయండి

పూసపాటిరేగ (భోగాపురం), ఆగస్టు 21: నిర్మాణ దశలో ఉన్న కార్యాలయాల పనులను త్వరితగతిన పూర్తి చేయా లని ఏజేసీ వెంకటరావు ఉధికారులకు సూచించా రు. కొళ్లాయి వలస గ్రామంలో నిర్మిస్తున్న సచివాలయ భవనాన్ని ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయాలు, పంచాయతీ భవనాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అఽధికా రులకు ఆదేశించారు.


అలాగే చేస్తున్న పనులన్నీ నాణ్యంగా ఉండే విధంగా నిరంతరం పరిశీలిస్తుండాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ ఈఈ జి.సత్యనారాయణ, పీఆర్‌డీఈ బంగారునాయుడు, మండల ఇంజినీరింగ్‌ అధికారి చంద్రునాయుడు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-22T09:17:26+05:30 IST