-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Collectorate troubled with dharnas
-
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
ABN , First Publish Date - 2020-12-29T05:02:23+05:30 IST
ధర్నాలతో కలెక్టరేట్ దద్దరిల్లింది. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని సోమవారం వివిధ సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టాయి. దీంతో కలెక్టరేట్ ఆవరణం కిక్కిరిసింది.

కలెక్టరేట్, డిసెంబరు 28 : ధర్నాలతో కలెక్టరేట్ దద్దరిల్లింది. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని సోమవారం వివిధ సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టాయి. దీంతో కలెక్టరేట్ ఆవరణం కిక్కిరిసింది. ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన జీవో 77 వెంటనే రద్దు చేసి, అర్హులైన విద్యార్థులందరికీ విద్యా దీవెన, వసతి దీవెన వర్తింపజేయాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో పీజీ సెంటరు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం డీఆర్‌వో గణపతిరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు రామ్మోహన్‌రావు, మహేష్, వెంకటేష్, సతీష్, రామకృష్ణ, హరీష్ తదితరులు ఉన్నారు. ప్రేమించి మోసం చేసిన వ్యక్తి, ఆయా కుటుంబ సభ్యు లపై చర్యలు తీసుకోవాలని బొండపల్లి మండలానికి చెందిన ఓ యువతి డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టింది. దీనిపై బొండపల్లి సేష్టన్ కూడా ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందని వాపోయింది. నివర్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలకు సంబంధించి ఎకరాకు రూ.35 వేలు నష్టప రిహారం అందజేయాలని జనసేన పార్టీ రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యురాలు పాలవలస యశస్వి డిమాండ్ చేశారు. జిల్లా జనసేన పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకూ నిరసన చేపట్టారు. కౌలు రైతులు, అన్నదాతల సమస్యలు పరిష్క రించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని రవితేజ, వెంకటేష్, కరుణ తదితరులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక బిల్లులును రద్దు చేయాలని సామాజిక చైతన్య వేదిక సభ్యులు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అట్రాసిటీ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులకు పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలోని కొమ్ము సోములు, శ్రీనివాసరావు, రాకోటి గోపాలరావు తదితరులు ఉన్నారు.