నాడు-నేడు పనులు వేగవంతం చేయండి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-08-01T10:14:40+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు పనులు వేగవం తంగా పూర్తిచేసి, రాష్ట్రస్థాయిలో జిల్లాను మొదటి మూడు స్థానాల్లో నిలపాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ ఆదేశించారు.

నాడు-నేడు పనులు వేగవంతం చేయండి: కలెక్టర్‌

కలెక్టరేట్‌, జూలై 31: ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు పనులు వేగవం తంగా పూర్తిచేసి, రాష్ట్రస్థాయిలో జిల్లాను మొదటి మూడు స్థానాల్లో నిలపాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్‌లో ఇంజినీరింగ్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నాడు-నేడు పనుల్లో విజయనగరం జిల్లా 6వ స్థానంలో ఉందని,  మొదటి స్థానంలోకి తీసుకుని రావడానికి ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.


పనుల్లో లోపాలు లేకుండా చూడాలన్నారు. అనం తరం గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు, వెల్‌నెస్‌ సెంటర్లు , భవనాలు , అంగన్‌వాడీ కేంద్రాల పనులుపై సమీక్షించారు. ఆర్‌బీకేలు, విలేజ్‌ క్లీనిక్‌ల నిర్మాణ ప్రగతి మరీ అధ్వానంగా ఉందని కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైతే కఠనంగా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పనుల్లో జాప్యం జరిగితే ఊరుకునేది లేదన్నారు. ఈ సమావేశంలో జేసీ  డాక్టర్‌ మహేష్‌కుమార్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సింహాచలం, డీఈవో నాగమణి, ఆర్‌వీఎం పీవో కృష్ణమూర్తినాయడు, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 


 9న గిరిజనులకు భూ పంపిణీ 

అర్హులైన గిరిజనులకి ఈనెల 9న  ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున భూ పట్టాలు పంపిణీ చేయాలని కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ చెప్పారు.  తన కార్యాలయంలో  డీఎల్‌ఎస్‌సీ సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ... గిరిజన రైతుకు మేలు జరిగేలా చూడాలన్నారు.  మొదటి విడతగా 16,142 మందికి సుమారు 45,874 ఎకరాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. రెండో విడతలో 2,215 మందికి  5201 ఎకరాలు, మూడో విడతగా 3,652 మందికి 6425 ఎకరాలు పంపిణీకి సిద్ధం చేశామన్నారు. 3న మరో విడత నిర్వహించే సమావేశంలోని ఖరారు చేస్తామన్నారు.  5న జిల్లా ఇన్‌చార్జి మంత్రి అధ్యక్షతన లబ్ధిదారుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.  

Updated Date - 2020-08-01T10:14:40+05:30 IST