పారిశుధ్య నిర్వహణపై కలెక్టర్‌ ఆగ్రహం

ABN , First Publish Date - 2020-11-08T04:39:55+05:30 IST

నగరంలోని బాలాజీ మార్కెట్‌లో పారిశుధ్య నిర్వ హణపై శనివారం కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ ఆగ్ర హం వ్యక్తం చేశారు.

పారిశుధ్య నిర్వహణపై కలెక్టర్‌ ఆగ్రహం
బాలాజీ మార్కెట్‌ పరిసరాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌

విజయనగరం దాసన్నపేట, నవంబరు 7:

నగరంలోని బాలాజీ మార్కెట్‌లో పారిశుధ్య నిర్వ హణపై శనివారం కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ ఆగ్ర హం వ్యక్తం చేశారు.  కంటోన్మెంట్‌ ప్రాంతంలోని చెరువులు, పార్కులు, గతంలో మొక్కలు నాటే ప్రదేశాలను హరిత బృందం సభ్యులతో కలిసి పర్య టించారు. ఈ సందర్భంగా బాలాజీ టెక్స్‌టైల్‌ మార్కె ట్‌కు వెళ్లారు.  అయితే అక్కడ చెత్తాచెదారంతో నిండి ప్రదేశాలను చూసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రకే తలమానికంగా నిలిచిన మార్కెట్‌ ఉండేది ఇలాగేనా? లాభాలు తప్ప, కొనుగోలు దారుల ఆరోగ్యం పట్టదా? అని మార్కెట్‌ కార్య వర్గాన్ని ప్రశ్నించారు. ఇక్కడకు వచ్చేవారు అనా రోగ్యం పాలైతే, ఎవరూ బాధ్యత వహిస్తారని నిల దీశారు. తక్షణమే పరిస్థితుల్లో మార్పురావాలని, లేనిపక్షంలో నగరపాలక సంస్థ ద్వారా తగిన చర్యలు చేపడతామని హెచ్చరించారు.  దీనిపై వర్తక సంఘం ప్రతినిధులు స్పందిస్తూ.. వారం, పది రోజుల్లో పారి శుఽధ్యాన్ని మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు.     కమిషనర్‌ వర్మ, పీటీసీ వైఎస్‌ ప్రిన్సిపాల్‌ మెహర్‌ బాబా, ఎంహెచ్‌వో సత్యనారాయణ పాల్గొన్నారు. 

 

Updated Date - 2020-11-08T04:39:55+05:30 IST