ప్రగతి నివేదిక అందించాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-05-17T10:42:34+05:30 IST

జిల్లాలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల ప్రగతిని రోజూ తనకు నివేదించాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ ఆదేశించారు

ప్రగతి నివేదిక అందించాలి : కలెక్టర్‌

 (విజయనగరం-ఆంధ్రజ్యోతి)

 జిల్లాలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల ప్రగతిని రోజూ తనకు నివేదించాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ ఆదేశించారు. శనివారం కలెక్టర్‌ చాంబర్‌ లో  జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాల కింద మంజూరు చేసిన నిర్మాణ పనుల విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవా లన్నారు. మన బడి, నాడు-నేడు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్‌నెస్‌ కేంద్రాలు, గ్రామీణ నీటి సరఫరా తదితర నిర్మాణ పనుల పురోగతిపై   కింది స్థాయి సిబ్బందితో  సమీక్షించాలని సూచించారు.  ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు.   పనులపై రోజూ గంట పాటు సంబంధిత జిల్లా అధికారులతో సమీక్షిస్తామన్నారు. ఇసుక, సిమెంట్‌ వంటి ముడి సరకులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 


భవన నిర్మాణాలకు ఎక్కడైనా స్థల సమస్య తలెత్తితే జిల్లా రెవెన్యూ అధికారిని సంప్రదించి సరిష్కరిం చుకోవాలన్నారు.    రైతు భరోసా పథకం  ప్రతి రైతుకు చేరాలని కోరారు. దానిని పాత బకాయిలకు జమ చేయొద్దని ఆదేశించారు. అలా చేసినట్లయితే బ్యాంకు సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో అభివృద్ధి సంక్షేమ, కారిక్రమాలకు కార్యక్రమాలకు బ్యాంకర్లు సహకారం అందించాలని కోరారు.  గత ఏడాది రబీలో రూ.886 కోట్లు రుణాలు లక్ష్యం కాగా రూ.712 కోట్లు చెల్లించినట్లు ఎల్‌డీఎం కె. శ్రీనివాసరావు చెప్పారు. ఖరీఫ్‌లో 1446.14 కోట్లు లక్ష్యం కాగా 1394 కోట్లు రుణాలు మంజూరు చేశామన్నారు. ఫ విజయనగరం: కొవిడ్‌ రిలీఫ్‌ ఫండ్‌కు  బీసీ కార్పొరేషన్‌ ఈడీ ఆర్‌వీ నాగరాణి  రూ.10 విరాళాన్ని అందించారు. ఈ చెక్‌కు కలెక్టర్‌కు అందజేశారు. 

Updated Date - 2020-05-17T10:42:34+05:30 IST