ప్రైవేటు ఆసుపత్రుల బంద్
ABN , First Publish Date - 2020-12-12T05:11:25+05:30 IST
ఆయుర్వేద వైద్యులకు శస్త్ర చికిత్సలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోపై పునరాలోచించాలని ప్రముఖ వైద్యుడు బీఎస్‌ఆర్ మూర్తి కోరారు.
బొబ్బిలి, డిసెంబరు 11: ఆయుర్వేద వైద్యులకు 58 రకాల ఆపరేషన్లు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించడాన్ని నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రులను శుక్రవారం బంద్ చేశారు. ఈసందర్భంగా స్థానిక ఐఎంఏ అధ్యక్ష, కార్యదర్శులు బొత్స కాశినాయుడు, గుల్ల రామ్‌నరేష్‌లు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తిరోగమన చర్య అని ఎద్దేవా చేశారు. ఈ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక శ్రీవేణుగోపాల నర్సింగ్‌హోం ముందు వైద్యు లంతా నినాదాలు చేశారు. కార్యక్రమంలో సీనియర్ వైద్యులు ఎ.గోపీనాథ్, జనార్దనరావు, బలరామ్‌నాయుడు, వెంకటనాయుడు, గౌరీశంకర్, హరిప్రసాద్, సునీత పాల్గొన్నారు.
ఆయుర్వేద వైద్యుల శస్త్ర చికిత్సపై పునరాలోచించాలి
గజపతినగరం: ఆయుర్వేద వైద్యులకు శస్త్ర చికిత్సలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోపై పునరాలోచించాలని ప్రముఖ వైద్యుడు బీఎస్‌ఆర్ మూర్తి కోరారు. ఈమేరకు శుక్రవారం స్థానిక శ్రీనివాసా నర్సింగ్ హోంలో విలేకర్ల సమావే శం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అత్యవసర సేవలు తప్ప మిగిలిన సేవలను నిలిపివేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు శీరంరెడ్డి పెద్దినాయుడు, వి.కృష్ణారావు, దేవిప్రసాద్, అజయ్‌కుమార్, అరుణాదేవి, సీతాస్రవంతి తదితరులు పాల్గొన్నారు.