మూతపడిన పరిశ్రమలు

ABN , First Publish Date - 2020-03-25T11:32:03+05:30 IST

కరోనా వ్యాప్తి నివార ణకు గాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఈనేప థ్యంలో మెరకముడిదాం, గరివిడి, గుర్ల మండలాల్లోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డా యి.

మూతపడిన పరిశ్రమలు

మెరకముడిదాం/నెల్లిమర్ల, మార్చి 24: కరోనా వ్యాప్తి నివార ణకు గాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఈనేప థ్యంలో మెరకముడిదాం, గరివిడి, గుర్ల మండలాల్లోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డా యి. మెరకముడిదాం మండలం పరిధిలోని ఎస్‌ఎంఎస్‌ పరిశ్రమ, గుర్ల మండల పరిధిలోని అంజిని ఫెర్రో పరిశ్రమ మూతపడింది. గరి విడి ఫేకర్‌ పరిశ్రమలో తక్కువ మందితో పని చేయిస్తున్నారు.


జూట్‌ మిల్లులో ఉత్పత్తి నిలిపివేత

నెల్లిమర్ల జూట్‌ మిల్లులో ఈనెల 31వ వర కు ఉత్పత్తిని నిలిపివేయడానికి  యాజమాన్యం అంగీకరించిందని మిల్లు శ్రామిక సంఘం అధ్యక్షుడు పతివాడ అప్పారావు చెప్పారు. కార్మికులు పనిచేయని రోజులకు సైతం మిల్లు యాజమాన్యం వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని ఇఫ్టూ నాయకుడు పి. మల్లిక్‌ ఆర్‌ఐ నరేష్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.  


గ్రోత్‌సెంటర్‌లో కార్మికుల ఆందోళన

కరోనా మహహ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించినా గ్రోత్‌ సెంటర్‌లోని పలు పరిశ్రమలు నడుస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలను పట్టించు కోకపోవడం, సంబంధిత అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రోత్‌ సెంటర్‌లోని  బెర్రి పరిశ్రమ ఎదుట కార్మిక సంఘాల నాయ కులు మంగళవారం ఆందోళనకు దిగారు. సీఐ టీయూ నాయకులు రెడ్డి వేణు, ఎస్‌.గోపాలం మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను రప్పించి ఉత్పత్తి  సాగిస్తుండడం దారుణమన్నారు. ఏపీఐఐసీ పరిధిలో అన్ని రకాల పరిశ్రమలను మూసివేయాలని, ఎవరైనా తెరిస్తే చర్యలు తప్పవని ఐలా కమిషనర్‌ బడగల హరిధరరావు హెచ్చరించారు.

Updated Date - 2020-03-25T11:32:03+05:30 IST