జిల్లా సరిహద్దులు మూసివేయండి

ABN , First Publish Date - 2020-03-24T08:17:24+05:30 IST

పొరుగు జిల్లాల్లో పాజిటివ్‌ కేసులు నమోదైనందున విజయనగరం జిల్లా సరిహద్దులను

జిల్లా సరిహద్దులు మూసివేయండి

మంత్రి బొత్స సత్యనారాయణ


విజయనగరం (ఆంధ్రజ్యోతి), మార్చి23: పొరుగు జిల్లాల్లో పాజిటివ్‌ కేసులు నమోదైనందున విజయనగరం జిల్లా సరిహద్దులను మూసివేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన జిల్లాకు చెందిన అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. విదేశాల నుంచి జిల్లాకు వచ్చి ఉంటున్న వారి వివరాలు, కదలికలపై అధికారులు దృష్టిసారించాలన్నారు. వారు ఇళ్లలోనే ఉంటున్నారా బయట తిరుగుతున్నారా అనే అంశాలపై  నిఘా ఉంచాలని తెలిపారు. కరోనా పాజిటివ్‌ కేసులు వస్తే చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. కరోనాపై జిల్లాకు ప్రత్యేక అధికారిగా పంచాయీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌ను నియమించినట్టు కలెక్టర్‌కు తెలిపారు.

Read more