నగర పాలక ఉద్యోగుల సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2020-04-18T11:03:06+05:30 IST

నగరపాలక సంస్థలో రెవెన్యూ, అకౌంట్‌ సెక్షన్లలో పనిచేస్తున్న ఆర్వో శ్రీనివాస్‌, జూనియర్‌ సహాయకులు జ్యోతి

నగర పాలక ఉద్యోగుల సస్పెన్షన్‌

విజయనగరం టౌన్‌, ఏప్రిల్‌17: నగరపాలక సంస్థలో రెవెన్యూ, అకౌంట్‌ సెక్షన్లలో పనిచేస్తున్న ఆర్వో శ్రీనివాస్‌, జూనియర్‌ సహాయకులు జ్యోతి బాలదాస్‌,  అకౌంట్‌ సెక్షన్‌ మేనేజర్‌ టీఎల్‌వీఎస్‌ ప్రసాద్‌, అదే విభాగానికి చెందిన సీనియర్‌ సహాయకురాలు భారతిపై కమిషనర్‌ వేటు వేశారు. మూడు రోజుల ముందే జ్యోతిబాలదాస్‌, భారతిలను  సస్పెండ్‌ చేయగా, మిగిలిన ఇద్దరికి  శ్రీముఖాలను జారీ చేసినట్లు సమాచారం. ఈ విషయమై కమిషనర్‌ వర్మను శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా కోవిడ్‌-19 విధుల్లో అలసత్వం వహించడం కార ణంగానే నగరపాలక ఉద్యోగులను సస్పెన్షన్‌ చేశామని స్పష్టం చేశారు. 

Updated Date - 2020-04-18T11:03:06+05:30 IST