కలెక్టరేట్‌ ఎదుట నిరసన హోరు

ABN , First Publish Date - 2020-07-14T10:27:58+05:30 IST

కరోనా వైరస్‌ విజృంభి స్తున్న నేపథ్యంలో నగరంలో విద్యుత్‌ శ్మశాన వాటికను తక్షణమే ఏర్పాటు..

కలెక్టరేట్‌ ఎదుట నిరసన హోరు

కలెక్టరేట్‌/విజయనగరం దాసన్నపేట, జూలై 13 :  కరోనా వైరస్‌ విజృంభి స్తున్న నేపథ్యంలో నగరంలో  విద్యుత్‌ శ్మశాన వాటికను తక్షణమే ఏర్పాటు చేయాలని సీపీఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా  నిర్వహించారు.  హౌస్‌ క్వారంటైన్‌లో ఉన్నవారికి పౌష్టికా  హారం కోసం రూ.600 ఇవ్వాల న్నారు. ప్రైవేటు ఆసు పత్రులను ప్రభుత్వం స్వాధీ నం చేసుకుని ప్రత్యేక కొవిడ్‌ ఆసుపత్రిగా మార్చాలని డిమాండ్‌ చేశారు. కొవిడ్‌ ఆసుపత్రి, క్వారంటైన్‌  కేంద్రం వద్ద మౌలిక వసతులు కల్పించాలని, పారిశుధ్య కార్మికులను 20 శాతం అదనంగా పెంచాలని కోరారు. ఈ నిరసనలో సీపీఎం ప్రతి నిధులు పాల్గొన్నారు. 


కలెక్టరేట్‌:  గంట్యాడ మండలంలోని లక్కిడాంలో అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేయకుండా అడ్డుకోవడం చాలా దారుణ మని దళిత హక్కులు పోరాట సమితి నాయకులు ఆరోపించారు. దీనిపై జిల్లా అధికారులు స్పందిం చాలని డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించిన నిరసన  కార్యక్రమంలో దళిత హక్క ల పోరాట సమితి నాయకులు ఉన్నారు.  ఫ రాయ్‌ పూర్‌ నుంచి విశాఖ ఎయిర్‌పోర్టు కోసం జిల్లాలోని గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణానికి చేపట్టిన  భూసేకరణ నిలిపివేయాలని జిల్లాకు చెందిన కొంత మంది రైతులు డిమాండ్‌ చేశారు.  ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌  కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. రైతు సంఘం నాయకులు రాంబాబు, ప్రకాష్‌ తదితరులున్నారు. 

Updated Date - 2020-07-14T10:27:58+05:30 IST