బస్సు బోల్తా... 13మందికి గాయాలు

ABN , First Publish Date - 2020-11-27T05:18:25+05:30 IST

బస్సు బోల్తా పడి 13మందికి గాయాలైన సంఘటన మండలంలోని చోడమ్మఅగ్రహారం వద్ద జాతీయ రహదారిపై గురువా రం రాత్రి చోటుచేసుకుంది.

బస్సు బోల్తా... 13మందికి గాయాలు
క్షతగాత్రులను 108లో తరలిస్తున్న దృశ్యం

పూసపాటిరేగ, నవంబరు 26: బస్సు బోల్తా పడి 13మందికి గాయాలైన సంఘటన మండలంలోని చోడమ్మఅగ్రహారం వద్ద జాతీయ రహదారిపై గురువా రం రాత్రి చోటుచేసుకుంది. ఒడిశా రాష్ట్రం బరంపురం నుంచి సుమారు 50 మంది వలస కూలీలు కేరళ రాష్ట్రానికి ఓ ప్రైవేటు బస్సుపై వెళ్తున్నారు. అయితే బస్సును చోడమ్మఅగ్రహారం వద్దగల జాతీయరహదారి పక్కన నిలుపుతుండగా బురద కారణంగా పక్కకు ఒరిగి బోల్తా పడింది. ఈ ఘటనలో  13మందికి గాయాలయ్యాయి. వీరిలో 11మందిని భోగాపురం సీహెచ్‌సీకి తరలించారు. తీవ్ర గాయాలపాలైన ఇద్దరిని విజయనగరం ఆస్పత్రికి తరలించారు. స్థానిక ఎస్‌ఐ ఆర్‌.జయంతి సంఘటనా స్థలానికి చేరుకొని అత్యవసర సేవలను అందజేశారు. బస్సులో కొందరు చిక్కుకోవటంతో వీరిని బయటకు తీశారు. అయి తే బస్సులో చిక్కుకొన్నవారికి ఎటువంటి ప్రాణాపాయం సంభవించలేదు. బస్సులో ప్రయాణిస్తున్న వారందరూ కూలి పనులకుగాను ఒడిసా నుంచి వెళ్తన్నవారే. 

 

 

Updated Date - 2020-11-27T05:18:25+05:30 IST