పుణ్యస్నానాలు నిషేధం

ABN , First Publish Date - 2020-11-16T04:12:05+05:30 IST

పుణ్యక్షేత్రాల్లోని పుష్కరిణి, దేవాలయ అనుసంధాన నదుల్లోనూ కార్తీక మాస పుణ్యస్నానాలకు దేవదాయ శాఖ అధికారులు ఈ ఏడాది బ్రేకు వేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

పుణ్యస్నానాలు నిషేధం
రామతీర్థం పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ

ఉత్తర్వులు జారీ చేసిన దేవాదాయ శాఖ

నెల్లిమర్ల, నవంబరు 15: పుణ్యక్షేత్రాల్లోని పుష్కరిణి, దేవాలయ అనుసంధాన నదుల్లోనూ కార్తీక మాస పుణ్యస్నానాలకు దేవదాయ శాఖ అధికారులు ఈ ఏడాది బ్రేకు వేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా సామూహిక స్నానాలకు, పుణ్యస్నానాలకు భక్తులను అనుమతించవద్దంటూ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వడంతో ఆలయాలకు ఆనుకుని ఉన్న పుష్కరిణిల వద్ద ఈమేరకు దేవదాయ శాఖ స్థానిక అధికారులు ఫ్లెక్సీ బోర్డులను ఏర్పాటు చేశారు. రామతీర్థం పుష్కరిణి ద్వారాల వద్ద కంచెను ఏర్పాటు చేసి మార్గాన్ని మూసివేశారు. భక్తుల స్నానాల కోసం ప్రత్యేక కుళాయిలు ఏర్పాటు చేసి నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ కుళాయిల వద్ద స్నానాలపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2020-11-16T04:12:05+05:30 IST