వచ్చేనెల 4న బోనస్‌ చెల్లింపు

ABN , First Publish Date - 2020-12-25T05:46:24+05:30 IST

నెల్లిమర్ల జూట్‌ మిల్లు కార్మికులకు వచ్చేనెల 4న బోనస్‌ చెల్లించేందుకు మిల్లు యాజమాన్యం అంగీకరించిందని మిల్లు శ్రామిక సంఘ అధ్యక్షుడు పతివాడ అప్పారావు వెల్లడించారు.

వచ్చేనెల 4న బోనస్‌ చెల్లింపు

నెల్లిమర్ల, డిసెంబరు 24: నెల్లిమర్ల జూట్‌ మిల్లు కార్మికులకు వచ్చేనెల 4న బోనస్‌   చెల్లించేందుకు మిల్లు యాజమాన్యం అంగీకరించిందని మిల్లు శ్రామిక సంఘ అధ్యక్షుడు పతివాడ అప్పారావు వెల్లడించారు. మిల్లు ప్రధాన గేటు వద్ద గురువారం  ఆయన మాట్లాడారు. క్రిస్మస్‌ పురస్కరించుకుని మిల్లులో పనిచేస్తున్న క్రిస్మస్‌ సోదరులకు గురువారమే  బోనస్‌ చెల్లించినట్ల్లు వివరించారు. పదవీ విరమణచేసిన కార్మికుల్లో ప్రస్తుతం నెలకు 20 మంది వరకు గ్రాట్యుటీ  చెల్లింపు జరుగుతోందని, మరో పదిమందికి ఇచ్చేలా యాజమాన్యంపై ఒత్తిడి తెస్తున్నామన్నారు.  ప్రధాన కార్యదర్శి  వెంకటరమణ, కార్యనిర్వహక అధ్యక్షుడు  వెంకట గోవిందరావు, సంఘం ప్రతినిధులు సత్యనారాయణ, సముద్రపు సత్యనారాయణ, రెడ్డి సన్యాసినాయుడు తదితరులు పాల్గొన్నారు

 

Updated Date - 2020-12-25T05:46:24+05:30 IST