మురుగు నీటికి అడ్డుకట్ట!
ABN , First Publish Date - 2020-11-12T05:16:36+05:30 IST
తెట్టంగి గ్రామంలో మురుగునీటి ప్రవాహం వివాదాస్పదంగా మారింది. మురుగునీరు వెళ్లే శివారు ప్రాంతంలో కొంతమంది కాలువకు అడ్డుగా మట్టి పోసేశారు. దీంతో మురుగునీరంతా రోడ్డుపైకి చేరింది. దీంతో గ్రామంలో ఈ అంశం వివాదాస్పందగా మారింది.
రోడ్డుపైనే నిలిచిపోయిన వైనం...
తెట్టంగిలో వివాదాస్పదంగా పరిస్థితి
గుర్ల : తెట్టంగి గ్రామంలో మురుగునీటి ప్రవాహం వివాదాస్పదంగా మారింది. మురుగునీరు వెళ్లే శివారు ప్రాంతంలో కొంతమంది కాలువకు అడ్డుగా మట్టి పోసేశారు. దీంతో మురుగునీరంతా రోడ్డుపైకి చేరింది. దీంతో గ్రామంలో ఈ అంశం వివాదాస్పందగా మారింది. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకపోయిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగు నీరు వెళ్లే ప్రాంతంలో శివారులో కొంతమంది భూములు కొనుగోలు చేశారు... వారు తమ భూముల్లోకి మురికినీరు వస్తే ఊరుకునేది లేదంటున్నారు. దీంతో ఈ వివాదం ఎటుదారి తీస్తుందోనని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ఎంపీడీవో వద్ద ప్రస్తావించగా... గురువారం ఆ గ్రామాన్ని సందర్శించి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.