రామతీర్థం ఘటనలో దోషులను శిక్షించాలి: సోమువీర్రాజు

ABN , First Publish Date - 2020-12-30T13:56:05+05:30 IST

జిల్లాలోని నెల్లిమర్ల మండలంలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన రామతీర్థం రామ గిరిపై ఉన్న రామస్వామివారి విగ్రహాన్నిధ్వంసం చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని బీజేపీ నేత సోమువీర్రాజు డిమాండ్ చేశారు.

రామతీర్థం ఘటనలో దోషులను శిక్షించాలి: సోమువీర్రాజు

విజయనగరం: జిల్లాలోని నెల్లిమర్ల మండలంలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన రామతీర్థం రామ గిరిపై ఉన్న రామస్వామివారి విగ్రహాన్నిధ్వంసం చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని బీజేపీ నేత సోమువీర్రాజు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా కొండపై ఆందోళన చేస్తున్న బీజేపీ కార్యకర్తల పట్ల ప్రభుత్వం యాంత్రంగా దురుసుగా ప్రవర్తించిందని ఆయన మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... ‘‘విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన రామతీర్థం రామ గిరిపై ఉన్న రామస్వామివారి విగ్రహాన్నిదుండగులు ద్వంసం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి, దోషులను వెంటనే శిక్షించాలి అని బీజేపీ ఆంధ్ర తరుపున డిమాండ్ చేస్తున్నాను. ధర్మ పరిరక్షణలో భాగంగా చారిత్రక దేవాలయాల రక్షణ ప్రతి పౌరుని బాధ్యత అనే అంశాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం గుర్తుంచాలి. కొండపై చలిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేస్తున్న ఉద్యమాన్ని ప్రభుత్వ అధికారులు నీరుగార్చే ప్రయత్నం చేయడం.. వారు చలిలో వున్న పరిస్థుతులలో, వారికి దుప్పట్లు కూడా కొండపైకి తీసుకెళ్లకుండా నిరోధిస్తున్న ప్రభుత్వ యంత్రాగం వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాను’’ అని సోమువీర్రాజు ట్వీట్ చేశారు.



Updated Date - 2020-12-30T13:56:05+05:30 IST