బైకును ఢీకొన్న లారీ..

ABN , First Publish Date - 2020-11-06T05:37:07+05:30 IST

బొడసింగిపేట గ్రామంలోగల పెట్రోల్‌ బంకు వద్ద జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

బైకును ఢీకొన్న లారీ..

 ముగ్గురికి తీవ్ర గాయాలు 

 చిన్నారి పరస్థితి విషమం

బొండపల్లి: మండలంలోని బొడసింగిపేట గ్రామంలోగల పెట్రోల్‌ బంకు వద్ద జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై ఎస్‌ఐ డి.సాయికృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పార్వతీపురం మండలం వెంకటనాయుడుపేట గ్రామానికి చెందిన గోపిశెట్టి జనార్దన్‌, భార్య వెంకటలక్ష్మి, కుమార్తె లాస్య మోటారుబైకుపై విశాఖ పట్నం వెళుతుండగా బోడసింగిపేట వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. అందిన సమాచారం మేరకు గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించగా, చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. స్థానిక హెచ్‌సీ నాగరాజు కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  

Updated Date - 2020-11-06T05:37:07+05:30 IST