-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Be prepared for online teaching
-
ఆన్‌లైన్ బోధనకు సిద్ధం కావాలి
ABN , First Publish Date - 2020-06-22T11:36:00+05:30 IST
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆన్‌లైన్ బోధనకు అధ్యాపకులు సిద్ధం కావాలని యంగ్ రీసెర్చర్స్ ఫోరం (వైఆర్‌ఎఫ్)

విజయనగరం దాసన్నపేట, జూన్ 21: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆన్‌లైన్ బోధనకు అధ్యాపకులు సిద్ధం కావాలని యంగ్ రీసెర్చర్స్ ఫోరం (వైఆర్‌ఎఫ్) జాతీయ అధ్యక్షుడు డాక్టరు ఎన్‌వీఎస్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. ఆచార్య నాగార్జున వ్యవసాయ విశ్వవిద్యాలయం వైఆర్‌ఎఫ్ సంయుక్తంగా ఐదు రోజుల ఫ్యాకల్సీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఆదివారం టీచింగ్ మెథడ్స్ (మోడ్స్ ఆఫ్ టీచింగ్) అనే అంశంపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా అంబేడ్కర్ విశ్వవిద్యాలయం రిటైర్డ్ ఉపకులపతి హెచ్ లజపతిరాయ్ మాట్లాడుతూ.. విద్యార్థుల సామర్థ్యం పెంపునకు ప్రతి అఽధ్యాపకుడు తగిన విధంగా అన్ని ప్రయత్నాలు చేయాలన్నారు. టెక్నాలజీ పరంగా అప్‌గ్రేడ్ అవ్వాలని సూచిం చారు. ఆన్‌లైన్ బోధనకే ప్రాధాన్యం ఇచ్చి విద్యార్థులకు చక్కటి బోధనాంశా లను అందించాలన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం కో-ఆర్డినేటర్ సరస్వతి రాజు అయ్యర్, డాక్టరు నాగకిషోర్, ఆర్‌ఎస్ వరహాలదొర, వివిధ రాష్ట్రాలకు చెందిన విశ్వవిద్యాలయాల అధ్యాపకులు ఆన్‌లైన్‌లో పాల్గొన్నారు