బీసీలపై చిన్నచూపు తగదు

ABN , First Publish Date - 2020-12-20T04:23:30+05:30 IST

బీసీలపై ప్రభుత్వానికి చిన్నచూపు తగదని టీడీపీ విజయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున శనివారం ఓ ప్రకటనలో అన్నారు.

బీసీలపై చిన్నచూపు తగదు

విజయనగరం రూరల్‌, డిసెంబరు 19: బీసీలపై ప్రభుత్వానికి చిన్నచూపు తగదని టీడీపీ విజయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున శనివారం ఓ ప్రకటనలో అన్నారు.   నిధులు లేని కార్పొరేషన్లను ఏర్పాటు చేసి, బీసీలకు పదవులు ఇచ్చామని సీఎం జగన్‌ ప్రకటించడం హస్యాస్పదమ న్నారు. లోకసభ, రాజ్యసభల్లో ప్రాతినిధ్యం వహించేందుకు  వైసీపీ ఎంపీల్లో బీసీలు ఎవరూ లేరా? అంటూ ప్రశ్నిం చారు. టీటీడీ, రాష్ట్రంలోని ముఖ్య కార్పొరేషన్లు, పలు పద వుల్లో, నామినేటేడ్‌తో పాటు, స్థానిక ఎన్నికల్లో కూడా  ఓ వర్గం వారికే అగ్రస్థానం ఇస్తున్నారని ఆరోపించారు. బీసీల కు ప్రాధాన్యం లేకుండా పోయిందని తెలిపారు.  

 

Read more