-
-
Home » Andhra Pradesh » Vizianagaram » BAS demanded that the scheme be continued
-
బీఏఎస్ పథకం కొనసాగించాలని డిమాండ్
ABN , First Publish Date - 2020-12-30T06:00:07+05:30 IST
పేద విద్యార్థుల కోసం గతంలో ప్రవేశపెట్టిన బీఏఎస్ ( బెస్ట్ అవైలబుల్ స్కీం) పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పాండ్రంకి వెంకటరమణ డిమాండ్ చేశారు.

విజయనగరం దాసన్నపేట, డిసెంబరు 29: పేద విద్యార్థుల కోసం గతంలో ప్రవేశపెట్టిన బీఏఎస్ ( బెస్ట్ అవైలబుల్ స్కీం) పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పాండ్రంకి వెంకటరమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం అంబేడ్కర్ జంక్షన్ కూడలిలోని రాస్తారోకో చేపట్టారు. ఫీజులు చెల్లించాలని, లేకుంటే టీసీలు ఇవ్వబోమని విద్యార్థులను కొన్ని కార్పొరేట్ పాఠశాలలు హింసిస్తున్నాయన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించక పోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జిల్లా పర్యటనకు వస్తున్న సీఎం జగన్ పేద బీఏఎస్ పథకం కొనసాగించే విధంగా హామీ ఇవ్వాలని, లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీఎస్‌పీ ప్రతినిధులు సయ్యద్ బుకారి, బిలాల్ అహ్మద్, బాలు, మాధవ, దుర్గాప్రసాద్, శివ తదితరులు పాల్గొన్నారు.