భూరక్షణ పథకంపై అవగాహన

ABN , First Publish Date - 2020-12-12T05:21:51+05:30 IST

జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్షణ పఽథకాలపై ఈనెల 14 నుంచి నిర్వహించనున్న అవ గాహన సదస్సులకు రైతులు సహకరించాలని శృంగవర పుకోట ఇన్‌చార్జి తహసీల్దార్‌ పి.హరి కోరారు

భూరక్షణ పథకంపై అవగాహన

శృంగవరపుకోట: జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్షణ పఽథకాలపై ఈనెల 14 నుంచి నిర్వహించనున్న అవ గాహన సదస్సులకు రైతులు సహకరించాలని శృంగవర పుకోట ఇన్‌చార్జి  తహసీల్దార్‌ పి.హరి కోరారు. ఈనెల 14న పోతనాపల్లి, కృష్ణాపురం, మామిడిపల్లి, ఈనెల 15న గోపాలపల్లి, కొత్తకోట, చామలాపల్లి, 16న ఎస్‌.కోట తలా రి, ఉసిరి, 17న మల్లిపూడి, దాంపురం, 18న విరనారా యణం, కొత్తూరు, 19న తిమిడి, కృష్ణమమాంతిపురం గ్రామాల్లో ఈ అవగాహన సభలు నిర్వహిస్తామన్నారు. 

శని, ఆదివారాల్లో నిర్వహించనున్న ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఇన్‌చార్జి తహసీల్దార్‌ కోరారు. పోలింగ్‌ బూత్‌ల వద్ద అధికారులు అందుబాటులో ఉంటారని, కొత్తగా నమోదు, మార్పులు వంటి వాటికి దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. 

Updated Date - 2020-12-12T05:21:51+05:30 IST