-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Awareness on human rights is needed
-
మానవ హక్కులపై అవగాహన అవసరం
ABN , First Publish Date - 2020-12-11T05:16:23+05:30 IST
మానవ హక్కులపై అవగాహన అవసరమని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ వైఎస్ చిన్నారావు, జిల్లా వైస్ చైర్మన్ డాక్టర్ కె.అదృష్టకుమార్ తెలిపారు.

బొబ్బిలి, డిసెంబరు 10: మానవ హక్కులపై అవగాహన అవసరమని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ వైఎస్ చిన్నారావు, జిల్లా వైస్ చైర్మన్ డాక్టర్ కె.అదృష్టకుమార్ తెలిపారు. పౌరులందరికీ రాజ్యాంగపరంగా అనేక హక్కులు కల్పించబడ్డాయని, వాటిని పొందేందుకు చట్టపరంగా పోరాడొచ్చని చెప్పారు. మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా గురువారం స్థానిక ఎన్జీవో హోమ్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రపంచంలో కోట్లాది మంది జీవించే హక్కును పొందలేకపోతున్నారని చెప్పారు. హక్కులు హరించడబడ్డాయని ఎవరైనా భావిస్తే.. తమ సంస్థను ఆశ్రయించి సంపూర్ణ న్యాయాన్ని పొందొచ్చన్నారు. జిల్లా ఐద్వా ఉపాధ్యక్షురాలు వి.ఇందిర, పట్టణ అధ్యక్షు రాలు కె.పుణ్యవతి ఆధ్వర్యంలో స్థానిక పాకీవీధి, కొత్తఎరుకలి వీధుల్లో మహిళలు ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహం ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఇందిర మాట్లాడుతూ.. మహిళలపై దాడులను అరికట్టాలని డిమాం డ్ చేశారు. బడుగు, బలహీన వర్గాలకు ఇప్పటికీ భూమి, జీవించే హక్కు లేకపోవడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో నారాయణమ్మ, శ్యామలమ్మ, పైడమ్మ పాల్గొన్నారు.
ప్రజలు చైతన్యవంతం కావాలి
రామభద్రపురం: రాజ్యాంగ హక్కులపై అవగాహన ఉండాలని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ బెంచ్ సభ్యుడు పెంకి చిట్టిబాబు తెలిపారు. స్థానిక జడ్పీఉన్నత పాఠశాలలో సదస్సు నిర్వహించారు. మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే వెంటనే ఫిర్యాదు చేయాలన్నారు. అన్ని వర్గాల ప్రజల హక్కులను కాపాడడానికి ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. రాష్ట్ర మానవహక్కుల సంస్థ అధ్యక్షుడు కె.నూకరాజు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ప్రశ్నించే హక్కును అలవరచుకోవాల న్నారు. జిల్లా మానవహక్కుల సంఘం అధ్యక్షుడు బి.శంకరరావు మాట్లా డుతూ.. బాల్య వివాహాలను నిరోధించడానికి కృషి చేయాలని అన్నారు. బాలికా చట్టాలపై అవగాహన పెం పొందించుకోవాలన్నారు. మానవ హక్కుల సంస్థ క్లబ్ మెంబర్ వరప్రసాద్, జిల్లా సెక్రటరీ రామాంజనేయమూర్తి, తహసీల్దార్ గణపతిరావు, ఎస్‌ఐ కృష్ణమూర్తి, పీహెచ్ సీ వైద్యాధికారి దిలీప్‌కుమార్, ఐసీడీఎస్ సూపర్ వైజర్ ఎర్రయ్యమ్మ, అమ్మరాజులు పాల్గొన్నారు.
సీఐటీయూ ర్యాలీ
సాలూరు : మానవ హక్కులను బీజేపీ ప్రభుత్వం హరిస్తుందని సీఐటీయూ రాష్ట్ర నాయకుడు ఎం.కృష్ణమూర్తి అన్నారు. సీఐటీయూ, ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ర్యాలీ పట్టణంలో నిర్వహిం చారు. జాతీయ రహదారిపై కేంద్ర సర్కార్ తీరుకు నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎన్‌వై నాయుడు, నారాయణమ్మ, ప్రభావతి పాల్గొన్నారు.
ఐద్వా ఆధ్వర్యంలో..
విజయనగరం (ఆంరఽధజ్యోతి): మహిళల హక్కులకు పోరాడుదామని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు, కార్యదర్శులు పి.రమణమ్మ, వి.లక్ష్మి పిలుపునిచ్చారు. ఐద్వా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఐద్వా కార్యాలయంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ.. బీజేపీ సర్కార్ పౌర హక్కులను కాలరాస్తోందన్నారు. కార్పొ రేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవసాయ చట్టాలను తెచ్చిన మోదీ మహిళా రిజర్వేషన్‌ను బుట్టదాఖలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా ఉపాధ్యక్షులు, జిల్లా సహాయ కార్యదర్శి ఆర్.హరికృష్ణవేణి, వేగోటి లక్ష్మి పాల్గొన్నారు. రింగురోడ్డు: మానవహక్కులపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని క్యూఫా ప్రతినిధి టి.దీప్తి అన్నారు. పూల్ బాగ్ లెప్రసీ కాలనీలో ప్లకార్డులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వీటీసీ వర్మ, వలంటీర్లు వర్మ, రమేష్, విద్యార్థులు పాల్గొన్నారు.
పుణ్యగిరి కళాశాలలో...
శృంగవరపుకోట,: ప్రభుత్వ పుణ్యగిరి డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ్‌బాబు ఆధ్వర్యంలో మానవహక్కుల దినోత్సవం నిర్వహిం చారు. అధ్యాపకులు అన్నాజీరావు, శ్రీనివాసరావు, రామరావు పాల్గొన్నారు.
మానవత్వంతో ఆదుకోవాలి
పార్వతీపురంటౌన్: ఏ అండలేని వారిని మానవత్వంతో ఆదుకు నేందుకు ముందుకు రావాలని, రాష్ట్ర నీటిపారుదల సంస్థ మాజీ డైరెక్టర్ మజ్జి కృష్ణమోహన్ అన్నారు. పట్టణం లోని నిరాశ్రయుల వసతిగృహంలోని వృద్ధులకు జాతీయ మానవ హక్కుల ఫోరం సభ్యులు అందజేసిన పండ్లు, ఆహార పదార్థాలను పంపిణీ చేశారు. ఫోరం సభ్యులు జగదీష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.